AP: నేడు ఒకే వేదికపైకి మోదీ-బాబు-పవన్‌

AP: నేడు ఒకే వేదికపైకి మోదీ-బాబు-పవన్‌
పొత్తు కుదిరాక నేడు తొలి బహిరంగ సభ... ఆసక్తిగా ఎదురుచూస్తున్న తెలుగు ప్రజలు

తెలుగుదేశం-జనసేన-బీజేపీ పొత్తు కుదిరాక నేడు రాష్ట్రంలో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తొలి బహిరంగసభ ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రధాని నరేంద్రమోదీ, చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌లు ఒకే వేదిక మీదకు రానున్న ఈ సభను విజయవంతం చేసేందుకు మూడు పార్టీల నేతలూ అవిశ్రాంతంగా శ్రమిస్తున్నారు. తెలుగుదేశం జాతీయ ప్రధాన కార్యదర్శి నారాలోకేష్‌ నేతృత్వంలో 13కమిటీలు పరస్పరం సమన్వయం చేసుకుంటూ యుద్ధ ప్రాతిపదికన ఏర్పాట్లు పూర్తి చేశాయి. చిలకలూరిపేటలో నేడు జరిగే ఎన్డీఏ కూటమి ప్రజాగళం బహిరంగసభను విజయవంతం చేయాలని... టీడీపీ, జనసేన, బీజేపీ ముఖ్యనేతలు పిలుపునిచ్చారు. సభ నిర్వహణ, సమన్వయం కోసం గుంటూరులో మూడు పార్టీల నాయకుల ఆత్మీయ సమావేశం నిర్వహించారు.


బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వినోద్ ధావడే ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. మోదీ ఆధ్వర్యంలో దేశం అభివృద్ధి పథంలో నడుస్తోందని, ఏపీ కూడా అలాగే ముందంజలో నిలవాలంటే కూటమికి మద్దతివ్వాలని కోరారు. రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని దుర్మార్గపు పాలన సాగుతోందన్న కూటమి నేతలు... రాష్ట్రాభివృద్ధి, భవిష్యత్తు కోసం మూడు పార్టీలు కలిసి ఎన్నికల్లో పోటీచేస్తున్నట్లు తెలిపారు. కూటమి సభకు ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి. పల్నాడు జిల్లా చిలకలూరిపేట మండలం బొప్పూడిలో 200 ఎకరాల్లో ఏర్పాట్లు చేస్తున్నారు. ప్రధాని మోదీ, చంద్రబాబు, పవన్‌ సభలో పాల్గొంటున్నందున ... అగ్రనేతల రాకకు వీలుగా హెలీప్యాడ్‌లను నిర్మించారు. పార్కింగ్‌ కోసం పెద్దఎత్తున ఏర్పాట్లు చేశారు. ప్రధాన వేదిక నిర్మాణం దాదాపు పూర్తికావొచ్చింది. 5 వేల మంది పోలీసులను రంగంలోకి దింపారు. సభా ప్రాంగణాన్ని ఎస్పీజీ తమ ఆధీనంలోకి తీసుకుంది. మూడు పార్టీల రంగులు కలిసివచ్చేలా స్టేజీపై అలంకరణ ఏర్పాట్లు చేస్తున్నారు. సభ ఏర్పాట్లను మూడు పార్టీల నేతలు పర్యవేక్షిస్తున్నారు. సభా ఏర్పాట్ల పరిశీలనకు స్థానిక గ్రామాల ప్రజలు వచ్చి వెళుతున్నారు.


మరోవైపు బ్రాహ్మణుల సంక్షేమానికి తెలుగుదేశం కట్టుబడి ఉందని ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చెప్పారు. ఉండవల్లిలోని నివాసంలో.. రాష్ట్ర బ్రాహ్మణ సాధికార కమిటీ అధ్యక్షుడు బుచ్చిరామ్ ప్రసాద్ అధ్వర్యంలో...... 50మంది బ్రాహ్మణ ప్రముఖులు తెలుగుదేశంలో చేరారు. వారందరికీ పసుపు కండువాలు కప్పి ఆహ్వానించిన లోకేశ్ ..2014 ఏడాది అధికారానికి రాగానే...... బ్రాహ్మణ కార్పొరేషన్ ఏర్పాటుచేసిన విషయాన్ని గుర్తు చేశారు. ఈ కార్పొరేషన్ ద్వారా ఐదేళ్లలో బ్రాహ్మణుల సంక్షేమానికి...... 285 కోట్లు ఖర్చు చేశామన్న లోకేశ్ ... స్వయం ఉపాధికి నాలుగు లక్షల వరకు 50 శాతం సబ్సిడీతో రుణాలు ఇచ్చామని తెలిపారు. ఈసారి తెలుగుదేశం అధికారానికి రాగానే........ దేవాదాయశాఖతో సంబంధం లేకుండా......... గుళ్ల నిర్మాణానికి బడ్జెట్ నుంచి నిధులు కేటాయిస్తామన్నారు. బ్రాహ్మణ కార్పొరేషన్ ను బలోపేతం చేస్తామని, బ్రాహ్మణ ఆడబిడ్డల పెళ్లికి ఆర్థిక సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. అర్చకులకు.... గుర్తింపు కార్డులు, గౌరవ వేతనం, గౌరవం ఇస్తామని లోకేష్ చెప్పారు.

Tags

Read MoreRead Less
Next Story