భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో TDP మేనిఫెస్టో

టీడీపీ అధికారంలోకి వచ్చాక అమలు చేసే పథకాల పై భవిష్యత్ కు గ్యారెంటీ పేరుతో పలు పథకాల పై మహానాడు లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారు.
1. మహాశక్తి పథకం కింద ఆడబిడ్డ నిధి:-18 ఏళ్లు నిండిన మహిళలు – నెలకు రూ.1500, ఏడాదికి రూ.18 వేలు, 5 ఏళ్లకు రూ.90 వేలు ఇవ్వనున్నారు. తల్లికి వందనం:- ప్రతి తల్లికి ఏడాదికి రూ.15 వేలు, దీపం పథకం:- ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితం, ఉచిత ప్రయాణం:- మహిళలకు ఉచిత ప్రయాణం
2. యువగళం:-యువగళం విన్నాం - 5 ఏళ్లలో 20 లక్షల ఉద్యోగాలు, యువగళం నిధి కింద నెలకు రూ.3000
3.అన్నదాత-అన్నదాతకు ఏడాదికి రూ. 20 వేలు.
4. రాష్ట్రం లో ఇంటింటికి మంచినీరు
5. బిసిలకు రక్షణ చట్టం
6. పూర్ టు రిచ్:- పేదలను సంపన్నులు చేస్తాం- ఆదాయం రెట్టింపు చేస్తామని మేనిఫెస్టోలో పేర్కొన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com