HBD Chandrababu : సోషల్ మీడియాలో హాల్ చల్ చేస్తోన్న చంద్రబాబు బర్త్ డే సాంగ్స్..!

HBD Chandrababu : టీడీపీ అధినేత చంద్రబాబు పుట్టినరోజు( (ఏప్రిల్ 20) ) సందర్భంగా ఆయనకీ పలువురు రాజకీయ నాయకులు, పార్టీ కార్యకర్తలు సోషల్ మీడియా ద్వారా శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కొందరు పార్టీ శ్రేణులు రూపొందించిన పాటలు, డాక్యుమెంటరీలు ట్విట్టర్ లో దూసుకుపోతున్నాయి.
టీడీపీ 'చంద్రన్న కథాగానం' పేరుతో రూపొందించిన పాట సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. చంద్రబాబును శివుడితో, మునితో పోల్చుతూ ఆ పాట సాగుతుంది. అటు తెలుగుదేశం నేత అట్లూరి నారాయణరావు రూపొందించిన భగభగమండుతున్న ఆంధ్రా రాష్ట్రమా అన్న వీడియో సాంగ్ వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది.
అటు దేశ విదేశాల్లోని టీడీపీ శ్రేణులు, చంద్రబాబు అభిమానులు బుధవారం భారీగా కార్యక్రమాలు తలపెట్టారు.
ఓ ప్రజల మనిషీ... శతమానం భవతి!#HBDTrendSetterCBN pic.twitter.com/ZxYTDtUUJS
— Telugu Desam Party (@JaiTDP) April 20, 2022
చంద్రబాబు గారి జీవితకథపై పాట ప్రోమో విడుదల చేయనున్న టిడిపి సీనియర్ నేతలు గోరంట్ల బుచ్చయ్యచౌదరి, వర్ల రామయ్య, బిటి నాయుడు, కూన రవికుమార్, మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి. https://t.co/bgS9lSQWib
— Telugu Desam Party (@JaiTDP) April 19, 2022
నారా చంద్రబాబునాయుడు గారి జన్మదిన సందర్భంగా తెలుగుదేశం నేత అట్లూరి నారాయణరావు రూపొందించిన ఈ వీడియో సాంగ్ వింటే ఒళ్ళు గగుర్పొడుస్తుంది. కళ్ళు తెరిపిస్తుంది. తెలుగునాట మంచి ఊపు తెస్తున్న ఈ పాట మీరూ చూడండి#HBDTrendSetterCBN pic.twitter.com/wFY2NxepSm
— Telugu Desam Party (@JaiTDP) April 20, 2022
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com