జగన్ పిరికిపంద... ధైర్యం ఉంటే మా ప్రశ్నలకు సమాధానం చెప్పండి : చంద్రబాబు

Nara chandrababu Naidu (File Photo)
జగన్ సర్కారు పాలనతో రాష్ట్ర ప్రజలు నిరాశ, నిస్పృహలో ఉన్నారన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. మున్సిపల్ కార్పోరేషన్ ఎన్నికల్లో భాగంగా కర్నూలులో నిర్వహించిన రోడ్‌షోలో నిర్వహించారు చంద్రబాబు. ఈ సందర్భంగా...వైసీపీ ప్రభుత్వంపై విరుకుచుపడ్డారు. పోలీసులు ఎప్పుడు ఇంటికి వస్తారో తెలియని పరిస్థితి నెలకొందని చెప్పారు.
రాష్ట్రంలో మత సామరస్యం దెబ్బతిందని.. ఆలయాలపై దాడులు చేస్తున్నారని ఆరోపించారు చంద్రబాబు. ఏపీలో ఏబీసీడీ పాలన సాగుతోందని ఎద్దేవా చేశారు. ఏ అంటే అట్రాసిటీ, ఆటవిక పాలన, బీ బాదుడు, సీ అవినీతి, డీ అంటే విధ్వంసమని తీవ్రస్థాయిలో దుయ్యబట్టారు.
టీడీపీ హయంలోఅభివృద్ధికి పెద్దపీట వేస్తే.. జగన్ విధ్వంసానికి పెద్దపీట వేశారని విమర్శించారు చంద్రబాబు. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల సందర్భంగా వైసీపీ నేతలు బలవంతపు ఏకగ్రీవాలు చేశారని ఆరోపించారు.
ఎప్పుడైనా చరిత్రలో ఇన్ని ఏకగ్రీవాలున్నాయా? అని ప్రశ్నించారు. టీడీపీ గెలిచిన స్థానాలనూ వైసీపీ నేతలు వారి ఖాతాలో వేసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com