టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడును పరామర్శించిన చంద్రబాబు

X
Chandrababu Mlc Bachula Arjunudu File Photo
అనారోగ్యానికి గురైన టీడీపీ ఎమ్మెల్సీ బచ్చుల అర్జునుడుని.. పార్టీ అధినేత చంద్రబాబు పరామర్శించారు. విజయవాడ రమేష్ ఆస్పత్రికి వెళ్లిన చంద్రబాబు.... అక్కడ చికిత్స పొందుతున్న అర్జునుడును పలకరించారు. ఆయనకు ధైర్యం చెప్పి త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. అర్జునుడు ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వైద్యులు తెలిపారు. బచ్చుల అర్జునుడుకి ఇటీవలే గుండెపోటు వచ్చింది. వెంటనే అతణ్ని రమేష్ ఆస్పత్రికి తరలించగా... వైద్యులు యాంజియోప్లాస్టీ చేశారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
