ఒకటిన్నర సంవత్సరంలో జమిలి ఎన్నికలు రావడం ఖాయం.. టీడీపీ గెలుపు ఖాయం : చంద్రబాబు

ఒకటిన్నర సంవత్సరంలో జమిలి ఎన్నికలు రావడం ఖాయమన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. ఆ ఎన్నికల్లో టీడీపీ విజయాన్ని ఎవరు ఆపలేరని స్పష్టం చేశారు. చిత్తూరు జిల్లా కుప్పంలో నిర్వహించిన రోడ్ షోలో పాల్గొన్న చంద్రబాబుకు.. జనం నీరాజనాలు పలుకుతూ మహిళలు హారతులు ఇచ్చారు. కుప్పం ప్రజలు తనను గుండెల్లో దాచుకున్నారని.. వారికి జీవితాంతం రుణపడి ఉండాలనని బాబు తెలిపారు.
తప హయాంలో పులివెందలకు తాను నీళ్లిస్తే.. కుప్పంకు నీళ్లివ్వకుండా జగన్ అడ్డుకున్నారని విమర్శించారు. కుప్పం ప్రజలపై జగన్ ఎందుకు వివక్ష చూపుతున్నారని ప్రశ్నించారు. తనకు రౌడీయిజం చేసే అవాలవాటు లేదని.. అదే కనుక ఉంటే మంత్రి పెద్దిరెడ్డి పుంగనూరులో ఉండేవారే కాదన్నారు. ఎవరెన్ని కుట్రలు పన్నినా కుప్పం ప్రజలను కాపాడుకుంటునన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com