తిరుపతి లోక్‌సభ ఉపఎన్నికపై ఫోకస్ పెట్టిన చంద్రబాబు

తిరుపతి ఉపఎన్నికపై టీడీపీ అధినేత చంద్రబాబు సమీక్ష సమావేశం కొనసాగుతోంది. ఈ సమావేశానికి పార్టీ సీనియర్లు, ముఖ్యనేతలు హాజరయ్యారు. 3 గంటలపాటు సీనియర్ నేతల అభిప్రాయాలను తీసుకున్నారు చంద్రబాబు. కాసేపట్లో తిరుపతి పార్లమెంట్ పరిధిలోనికి వచ్చే 7 అసెంబ్లీ నియోజకవర్గాల నేతలతో విడివిడిగా భేటీ కానున్నారు. ఐదుగురితో తిరుపతి ఉపఎన్నికలపై మానిటరింగ్ కమిటీ వేశారు. ఈ కమిటిలో అచ్చెన్నాయుడు, నారా లోకేష్, బీద రవిచంద్ర, పనబాక కృష్ణయ్య, సోమిరెడ్డిలు ఉన్నారు
తిరుపతి ఉపఎన్నికల్లో ప్రతి ఒక్కరూ పోరాడాలన్నారు చంద్రబాబు. అలా పోరాడిన వారికే పార్టీలో గుర్తింపు ఉంటుందన్నారు. సార్వత్రిక ఎన్నికలు వచ్చే లోపు ఇదే పెద్ద ఉపఎన్నిక కాబట్టి... ప్రతి ఒక్కరు కష్టపడాలన్నారు. క్షేత్రస్థాయిలో నాయకులు పనిచేయకుండా కబుర్లు చెపితే కుదరదన్నారు. రిజర్వేషన్లు, విధేయతలు, మొహమాటాలు ఇకపై చెల్లవన్నారు చంద్రబాబు. వైసీపీ వైఫల్యాలపై పది అంశాలు గుర్తించి ప్రతి ఇంటికి వెళ్లి వాటిని వివరించాలన్నారు. నాయకులు క్షేత్రస్థాయి పనితీరుకు మున్సిపల్ ఎన్నికల ఫలితాలు అద్దం పడుతున్నాయన్నారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com