CBN: 160 సీట్లలో గెలుపు మాదే

CBN: 160 సీట్లలో గెలుపు మాదే
ఏపీ 30 ఏళ్ల భవిష్యత్తే కూటమి లక్ష్యమన్న చంద్రబాబు.. ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులకు వర్క్‌షాప్

తెలుగుదేశం ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులతో విజయవాడలో వర్క్‌షాప్ నిర్వహించిన చంద్రబాబు ఎన్నికల్లో ప్రచారం, నామినేషన్ల దాఖలు వంటి అంశాలపై చర్చించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం అభ్యర్థులతో పాటు జనసేన, బీజేపీ ప్రతినిధులు కూడా పాల్గొన్నారు. ఎన్నికల ప్రవర్తనా నియమావళి, అభ్యర్థులకు ఉండే హక్కులు, వైసీపీ కుట్రలు లాంటి అంశాలపై చంద్రబాబు నేతలకు మార్గనిర్దేశనం చేశారు. అభ్యర్థులు అనుసరించాల్సిన పద్దతులను, వ్యూహాలపై చంద్రబాబు ప్రజెంటేషన్‌ ఇచ్చారు. కోడ్‌ ఉల్లంఘించారని ఫోటోలు తీస్తుంటే కడప ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిపై వైసీపీ నాయకులు దాడికి యత్నించడంపై చంద్రబాబు మండిపడ్డారు. అన్యాయంపై మాధవి ఎదురు తిరిగిన తీరుని ప్రతి ఒక్కరూ స్ఫూర్తిగా తీసుకోవాలని పిలుపునిచ్చారు. ఎన్నికల్లో వైకాపా లాంటి పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలని వ్యాఖ్యానించారు.


విశాఖలో దొరికిన డ్రగ్స్‌లో ఏపీ అధికారుల తీరును సీబీఐ సైతం తప్పుబట్టిందని చెప్పిన చంద్రబాబు డ్రగ్స్‌పై పోరాడుతుంటే వైకాపా నాయకులు తెలుగుదేశం కార్యాలయంపై దాడి చేశారని మండిపడ్డారు. సీఎం జగన్‌ ఒక్కసారి కూడా గంజాయి, డ్రగ్స్‌ కట్టడిపై ఎందుకు సమీక్ష చేయలేదని నిలదీశారు. గ్రేటర్ రాయలసీమ పరిధిలో...... 41 మందికి రెడ్లకే వైసీపీ టిక్కెట్లు ఇచ్చిందని తెలిపారు. తెలుగుదేశంలో... బీసీలకే పెద్ద పీట వేశామన్నారు. 160కి పైగా అసెంబ్లీ స్థానాలు గెలవడానికి...... 160 సమావేశాలు పెడుతున్నానని, అన్ని సెగ్మెంట్లలో పర్యటిస్తానని చంద్రబాబు తెలిపారు. టికెట్లు దక్కని అభ్యర్థులునిరుత్సాహానికి గురికావొద్దన్న చంద్రబాబు.. ప్రభుత్వం వచ్చాక అందరికి తగిన అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.


ఆంధ్రప్రదేశ్ ప్రగతి కోసం తెలుగుదేశం, జనసేన, బీజేపీ వేసే పునాది . 30 ఏళ్ల భవిష్యత్తుకు నాంది పలకాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీలో NDA 160 సీట్లకుపైగా గెలవబోతోందని కేంద్రంలో కూడా 400లకు పైగా ఎంపీ సీట్లు వస్తాయని చెప్పారు. ఎన్నికల్లో రాజకీయ పార్టీలను కట్టడి చేయాలంటే డిజిటల్ కరెన్సీ రావాలన్న చంద్రబాబు పొత్తు వల్ల సీట్లు కోల్పోయిన తెలుగుదేశం నేతల త్యాగాన్ని తానెప్పుడూ మరచిపోనని చెప్పారు. వారికి మరిన్ని అవకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Tags

Read MoreRead Less
Next Story