TDP: బాబుతోనే దళితులంటూ నినదించిన నేతలు

TDP: బాబుతోనే దళితులంటూ నినదించిన నేతలు
దళిత సమ్మేళన సభ నిర్వహించిన టీడీపీ... జగన్ వైఖరిపై ఆగ్రహం

SCలు తిరగబడి జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని తెలుగుదేశం నేతలు పిలుపునిచ్చారు. నా SC, నా ST అంటూనే జగన్ ఆ సామాజిక వర్గంపై దాడి చేస్తున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబుపై అక్రమ కేసులను వ్యతిరేకిస్తూ పార్టీ S.C. సెల్ అధ్యక్షుడు M.S. రాజు చేపట్టిన సైకిల్ యాత్ర ముగింపు సందర్భంగా మంగళగిరిలోదళిత సమ్మేళన సభ నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ లో వచ్చే ఎన్నికల్లో 29 SC స్థానాల్లో అన్ని చోట్లా గెలుస్తామనితెలుగుదేశం ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. జనసేన కలిస్తే పులివెందులలోనూ విజయం సాధిస్తామన్నారు. దళితులంతా బాబుతోనే నినాదం పేరిట తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో దళిత సమ్మేళనసభ నిర్వహించారు.


దళితుల ఆత్మగౌరవాన్ని వైసీపీ దళిత ప్రజా ప్రతినిధులు సీఎం జగన్ కాళ్ల దగ్గర తాకట్టు పెట్టారని అచ్చెన్న విమర్శించారు. ఈసారి జరిగే ఎన్నికల్లో పులివెందుల సహా అన్ని స్థానాల్లో తెలుగుదేశం గెలుపు ఖాయమని అచ్చెన్న ధీమా వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులు ప్రతి మాల పల్లెకు వెళ్లి సైకిల్ గుర్తుకు ఓటుపడేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు. మాల మాదిగల పంతం వైసీపీ అంతం నినాదంతో ముందుకెళ్లాలని అచ్చెన్నాయుడు సూచించారు.

ఎస్సీలపై జరుగుతున్న దాడులను ఆంధ్రప్రదేశ్ మొదటి వరుసలో ఉందని తెలుగుదేశం పార్టీ ఎస్సి విభాగం రాష్ట్ర అధ్యక్షులు ఎమ్మెస్ రాజు ఆరోపించారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో అనంతపురం నుంచి మంగళగిరి వరకు సైకిల్ యాత్ర నిర్వహించారు. మంగళగిరిలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం వరకు సైకిల్ ర్యాలీ చేపట్టారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు పై తప్పుడు కేసులు వేసిన ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అంతకంతకు శిక్ష అనుభవిస్తారని చెప్పారు. అంతకుముందు ఎమ్మెస్ రాజు సైకిల్ యాత్రలో పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శించారు. టీడీపీ డీజే వాహనానికి పోలీసులు అనుమతి ఇవ్వలేదు.

మరోవైపు శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర మండలంలో కరవు ప్రాంతాలను పరిశీలించి వస్తున్న టీడీపీ నేతలను పోలీసులు అడ్డుకున్నారు. మంగళవారం ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో ఎటువంటి ఘటనలు జరగకుండా ముందస్తుగా అరెస్టు చేసేందుకు వచ్చినట్లు నేతలకు తెలిపారు. అరెస్టు చేసేందుకు యత్నించగా టీడీపీ నేతలు ఖండించారు. పోలీసుల తీరును నిరసిస్తూ... స్టేషన్ ముందు పడుకొని నేతలు ఆందోళన చేపట్టారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

Tags

Read MoreRead Less
Next Story