ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే ఎన్నికలు జరిపి ఏం లాభం ; టీడీపీ

ప్రజాస్వామ్యం ఖూనీ అవుతుంటే ఎన్నికలు జరిపి ఏం లాభం ; టీడీపీ
బహిరంగంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

తిరుపతి ఎన్నికలను రద్దు చేయాలని డిమాండ్ చేసింది టీడీపీ. బహిరంగంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నా ఎన్నికల అధికారులు, పోలీసులు చోద్యం చూస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు.

కడప నుంచి మనుషులను రప్పించి మరీ దొంగ ఓట్లు వేయిస్తున్న ఆధారాలను కూడా టీడీపీ బయటపెట్టింది. బస్సులు, కార్లులో వందల మందిని రప్పిస్తున్న విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోనప్పుడు ఇక ఎన్నికలు జరిగి ఏం లాభం అని ప్రశ్నిస్తున్నారు.

స్వయానా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి చెందిన కల్యాణమండపంలో 5వేల మందిని తీసుకొచ్చి దొంగ ఓట్లు వేయడానికి ప్రయత్నించారని నారా లోకేశ్ ఆరోపించారు. ఉదయం నుంచి కొన్ని వేల మంది బయటి వ్యక్తులను తిరుపతికి తరలిస్తున్నా.. ఇప్పటి వరకు కనీసం చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ సైతం బస్సుల్లో వస్తున్న దొంగ ఓటర్లను ప్రశ్నించారు, బస్సులను పట్టుకుని పోలీసులకు అప్పగించారు.

అయినప్పటికీ, పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నేతలు. ఇంత బహిరంగంగా ప్రజాస్వామ్యం ఖూనీ అవుతున్నప్పుడు ఇక ఎన్నికలు జరిగి ఏం లాభం అని ప్రశ్నిస్తోంది టీడీపీ.

Tags

Next Story