మాజీ మంత్రి కళావెంకట్రావు అరెస్టుతో రాజాంలో ఉద్రిక్తత

మాజీ మంత్రి కళావెంకట్రావు అరెస్టుతో రాజాంలో ఉద్రిక్తత

తెలుగుదేశం సీనియర్‌ నేత, మాజీ మంత్రి కళా వెంకట్రావును పోలీసులు అరెస్ట్‌ చేయడం ఉద్రిక్తతకు దారితీసింది. విజయనగరం జిల్లా రామతీర్థం పర్యటనకు వెళ్లిన వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వాహనంపై పలువురు రాళ్లు, చెప్పుల దాడి చేసిన ఘటనలో పోలీసులు అరెస్టు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు టీడీపీ అధినేత చంద్రబాబును ఏ-1గా చేర్చిన పోలీసులు.. టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడును ఏ-2గా, టీడీపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కళావెంకట్రావును ఏ-3గా పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో.. బుధవారం రాత్రి 9 గంటలకు శ్రీకాకుళం జిల్లా రాజాంలోని నివాసంలో భోజనం చేస్తున్న కళావెంకట్రావును నెల్లిమర్ల పోలీసులు అరెస్ట్‌ చేశారు. బలవంతంగా జీపు ఎక్కించుకుని.. చీపురుపల్లి పీఎస్‌కు తరలించారు. విషయం తెలియగానే పెద్ద సంఖ్యలో టీడీపీ నేతలు, కార్యకర్తలు కళావెంకట్రావు నివాసానికి చేరుకున్నారు. పరిస్థితి అదుపు తప్పకుండా పోలీసులు భారీగా మోహరించారు.

Tags

Read MoreRead Less
Next Story