టీడీపీ నేత అంకులు మృతిని తట్టుకోలేక ఆయన బావమరిది మృతి

టీడీపీ నేత అంకులు మృతిని తట్టుకోలేక ఆయన బావమరిది మృతి
X
ది. అంకులు హత్యపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆయన బావమరిది యడ్లపల్లి శ్రీనివాసరావు గుండెపోటుతో మరణించారు.

గుంటూరు జిల్లా దాచేపల్లిలో టీడీపీ నేత, మాజీ సర్పంచ్‌ పురంశెట్టి అంకులు కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది. అంకులు హత్యపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన ఆయన బావమరిది యడ్లపల్లి శ్రీనివాసరావు గుండెపోటుతో మరణించారు. పెదగార్లపాడు గ్రామానికి చెందిన శ్రీనివాసరావు.. పురంశెట్టి అంకులు మృతిని తట్టుకోలేకపోయారు. దారుణ హత్యపై కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ క్రమంలో గుండెపోటు రావడంతో మృతి చెందారు. యడ్లపల్లి శ్రీనివాసరావు ఆకస్మిక మృతితో పెదగార్లపాడు గ్రామంలో విషాద ఛాయలు అలముకున్నాయి.


Tags

Next Story