ఏసీబీ కస్టడీలోకి టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర..!

ఏసీబీ కస్టడీలోకి టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర..!
సంఘం డైరీలో అవకతవకలు, ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు

సంఘం డైరీలో అవకతవకలు, ఫోర్జరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్రను ఏసీబీ అధికారులు కస్టడీలోకి తీసుకున్నారు. రాజమండ్రి జైలు నుండి విజయవాడ గొల్లపూడి ఏసీబీ కార్యాలయానికి తరలించారు. న్యాయవాది సమక్షంలో ధూళిపాళ్లను ఏసీబీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. మరోవైపు ఏసీబీ కార్యాలయం వద్ద ధూళిపాళ్ల నరేంద్ర కుటుంబసభ్యులు చేరుకున్నారు. ప్రభుత్వం ఉద్ధేశ్యపూర్వకంగా అక్రమ కేసులు పేరుతో వేధింపులకు పాల్పడుతోందని ధూళిపాళ్ల సతీమణి ఆరోపించారు. తాము న్యాయ పోరాటం చేస్తామని ధూళిపాళ్ల సతీమణి అన్నారు.

Tags

Next Story