Pattabhi Ram: కోర్టులో టీడీపీ నేత పట్టాభి..

X
Pattabhi Ram (tv5news.in)
Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌ను కోర్టులో హాజరు పరిచారు. కొద్ది సేపటి క్రితమే కోర్టుకు తీసుకొచ్చారు పోలీసులు. ఈ ఉదయం విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో పట్టాభికి వైద్య పరీక్షలు నిర్వహించారు. అనంతరం ఆయన్ను ఆసుపత్రి నుంచి నేరుగా కోర్టుకు తీసుకొచ్చారు. నిన్న రాత్రి హైడ్రామా మధ్య పట్టాభిని అరెస్ట్ చేశారు పోలీసులు. సీఎం జగన్‌పై పరుష పదజాలం ఉపయోగించనట్లు ఆయనపై 352, 153 ఎం, 505 (2), 353, 504 రెడ్‌విత్ 120( బి) సెక్షన్ల కింద గవర్నర్ పేట పీఎస్‌లో కేసు నమోదైంది. ఈ విషయాన్ని పోలీసులు ఓ ప్రకటనలో తెలిపారు. పట్టాభిపై ఎవరు ఫిర్యాదు చేశారన్న విషయాన్ని మాత్రం అందులో ప్రస్తావించలేదు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
