TDP leader Pattabhi : రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి..
TDP leader Pattabhi : రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి..రాజమండ్రి సెంట్రల్ జైలుకు పట్టాభి..టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పట్టాభిని.. ఈ ఉదయం మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలు నుంచి... రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు పోలీసులు.
ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించిన నేపథ్యంలో... నిన్న మచిలీపట్నం స్పెషల్ సబ్ జైలుకు తరలించారు పోలీసులు. .నిన్న రాత్రంతా ఆయన్ను మచిలీపట్నం సబ్‌జైల్లో ఉంచారు. ఇవాళ అక్కడినుంచి.. ఈ రాజమండ్రి సెంట్రల్‌జైలుకు తరలించారు.
విజయవాడ కోర్టులో... పట్టాభి నిన్నే బెయిల్ పిటీషన్ దాఖలు చేశారు. దీనిపై ఇవాళ విచారణ జరగనుంది
సీఎం జగన్‌పై పరుష పదజాలంతో దూషించిన కేసులో బుధవారం రాత్రి హైడ్రామా మధ్య పట్టాభిని అరెస్ట్ చేశారు పోలీసులు. పట్టాభి నివాసానికి వెళ్లిన పోలీసులు.. తలుపులు బద్దలు కొట్టి మరీ లోపలికి వెళ్లి ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.
పట్టాభిపై 352, 153 ఎం, 505 (2), 353, 504 రెడ్‌విత్ 120( బి) సెక్షన్ల కింద గవర్నర్ పేట పీఎస్‌లో కేసు నమోదయ్యాయి. విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టులో హాజరుపరచగా... పట్టాభికి 14 రోజుల రిమాండ్ విధించారు న్యాయమూర్తి.
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com