Satrucharla Chandrasekhar Raju: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ కన్నుమూత..

Satrucharla Chandrasekhar Raju: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ కన్నుమూత..
X
Satrucharla Chandrasekhar Raju: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ కన్నుమూశారు.

Satrucharla Chandrasekhar Raju: టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే శత్రుచర్ల చంద్రశేఖర్ కన్నుమూశారు. కొంతకాలంగా కిడ్నీ సంబంధిత వ్యాధితో బాధపడుతున్న ఆయన పార్నతీపురం మన్యం జిల్లాలో తుదిశ్వాస విడిచారు. శత్రుచర్ల మృతిపట్ల రాజకీయ ప్రముఖులు సంతాపం వ్యక్తం చేస్తున్నారు. చంద్రశేఖర్‌ ఆత్మకు శాంతి చేకూరాలని నారా లోకేష్ ప్రార్థించారు.

వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. కురుపాం ఎమ్మెల్యే, మాజీ డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి మామే శత్రుచర్ల చంద్రశేఖర్. మాజీమంత్రి శత్రుచర్ల విజయరామరాజుకు స్వయాన తమ్ముడు. గతంలో కాంగ్రెస్ తరఫున ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు శత్రుచర్ల చంద్రశేఖర్ రాజు. 1989- 94లో నాగూరు నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహించారు.

Tags

Next Story