చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం

చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం
విజయవాడలోని కేశినేని చిన్ని కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి

విజయవాడలోని కేశినేని చిన్ని కార్యాలయం వద్ద సంబరాలు అంబరాన్నంటాయి. రాజమహేంద్రవరం మహానాడు వేదికగా టీడీపీ అధినేత చంద్రబాబు విడుదల చేసిన మేనిఫెస్టోపై పార్టీ శ్రేణులు హర్షం వ్యక్తం చేస్తున్నాయి. కేశినేని చిన్ని ఆధ్వర్యంలో చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. నాడు అన్న ఎన్టీఆర్‌ మహిళలకు ఆస్తిలో సమానహక్కు కల్పిస్తే.. ఇవాళ చంద్రబాబు మహిళలకు మహా శక్తి కార్యక్రమం కింద అద్భుతమైన కార్యక్రమాలను ప్రకటించారని కేశినేని చిన్ని అన్నారు. దీపం పథకం కింద మూడు గ్యాస్‌ సిలిండర్లు, ఉచిత బస్సు ప్రయాణం, అమ్మకు వందనం కింద ఏడాదికి 15వేలు.. ఇలా అనేక కార్యక్రమాలను ప్రకటించారని చిన్ని అన్నారు.. చంద్రబాబు మహిళా పక్షపాతి అని అన్నారు.

Tags

Read MoreRead Less
Next Story