Chandrababu: కొడాలి నాని దిష్టిబొమ్మను దగ్ధం.. చంద్రబాబుపై చేసిన కామెంట్స్‌కు టీడీపీ శ్రేణుల ఫైర్..

Chandrababu (tv5news.in)
Chandrababu: చంద్రబాబు కుటుంబంపై అసెంబ్లీలో వైసీపీ చేసిన అనుచిత వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు రగిలిపోతున్నాయి. మంత్రి కొడాలినాని, ఎమ్మెల్యే అంబటి రాంబాబుపై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఏపీ వ్యాప్తంగా వారిద్దరి దిష్టిబొమ్మలు దగ్ధం చేస్తూ నిరసన వ్యక్తం చేస్తున్నారు. ఖబడ్దార్ కొడాలి నాని అంటూ హెచ్చరిస్తున్నారు.
విజయవాడలో కొడాలి నాని దిష్టిబొమ్మను ఉరేగించి దహనం చేశారు టీడీపీ కార్యకర్తలు. చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతల వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. అనంతపురంలో కొడాలి నాని దిష్టిబొమ్మను టీడీపీ శ్రేణులు దగ్ధం చేశారు.
దీనిని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేయగా అక్కడ కాసేపు ఉద్రిక్తత నెలకొంది. టీడీపీ కార్యకర్తలను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు పోలీసులు. చేతనైతే సుపరిపాలన చేయండి.. కుటుంబ సభ్యులను అవమానించే విధంగా మాట్లాడడం పిరికిపంద చర్యగా టీడీపీ నేతుల మండిపడ్డారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com