Kurnool: కర్నూల్ జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్‌పై హత్యాయత్నం..

tikka reddy (tv5news.in)

tikka reddy (tv5news.in)

Kurnool: కర్నూల్ జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డిపై హత్యాయత్నాన్ని ఖండించారు ఆపార్టీ సీనియర్‌ నేతలు.

Kurnool: కర్నూల్ జిల్లా మంత్రాలయం టీడీపీ ఇంచార్జ్ తిక్కారెడ్డిపై హత్యాయత్నాన్ని ఖండించారు ఆపార్టీ సీనియర్‌ నేతలు. తిక్కారెడ్డి నివాసానికి వెళ్లిన కర్నూలు టీడీపీ అధ్యక్షులు సోమిశెట్టి వెంకటేశ్వర్లు, ఎమ్మిగనూరు టీడీపీ ఇంచార్జ్‌ బీవీ జయనాగేశ్వర్‌రెడ్డి, పలువురు నేతలు ఆయన్ను పరామర్శించారు. దాడి జరిగిన తీరుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.

పథకం ప్రకారమే తిక్కారెడ్డిపై దాడి చేశారంటూ మండిపడ్డారు. తిక్కారెడ్డికి ప్రజల్లో పెరుగుతున్న ఆదరణ చూసి వైసీపీ నేతలు జీర్ణించుకోలేక పోతున్నారని నిప్పులు చెరిగారు.తనపై దాడి జరగడం మూడోసారి అన్నారు తిక్కారెడ్డి. తన అడ్డు తొలగించుకోవాలనే ఎమ్మెల్యే బాలనాగిరెడ్డి చూస్తున్నారని ఆరోపించారు. ఇలాంటి దాడులకు భయపడేది లేదన్నారు.

ఇటువంటి ఘాతుకానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. టీడీపీ కార్యకర్తలు ఉండటంతోనే తాను ప్రాణాలతో బయట పడ్డానన్నారు తిక్కారెడ్డి. వైసీపీ దాడుల్లో ఏడుగురు టీడీపీ కార్యకర్తలు తీవ్రంగా గాయపడినట్లు తెలిపారు. తాము అధికారంలోకి రాగానే ఎవ్వరినీ విడిచి పెట్టేది లేదని.. వడ్డీతో సహా తిరిగి చెల్లిస్తాంటూ హెచ్చరించారు తిక్కారెడ్డి.తిక్కారెడ్డిపై హత్యాయత్నాన్ని తీవ్రంగా ఖండించారు మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు.

సీఎం జగన్‌ అధికారంలోకి రాగానే టీడీపీ నేతలను టార్గెట్‌ చేసి దాడులకు ఉసిగొల్పుతున్నారని ఆరోపించారు. జగన్‌ పాలనలో గ్రామాభివృద్ధి కుంటుపడిందన్నారు. టీడీపీతోనే ప్రజారంజక పాలన సాధ్యమవుతుందన్నారు. రెండున్నరేళ్ల వైసీపీ పాలనలో.. ప్రతిపక్షంపై దాడులు చేయించడం తప్ప.. రాష్ట్రాభివృద్ది కనిపించడం లేదన్నారు.

మాజీ హోంమంత్రి నిమ్మకాయల చిన్నరాజప్ప.. జగన్‌ ప్రభుత్వం నిప్పులు చెరిగారు. ఫ్యాక్షనిస్టులు రెచ్చిపోతుంటే పోలీసులు చోద్యం చూస్తున్నారా అని ప్రశ్నించారు. సీఎం ప్రోద్బలంతోనే.. టీడీపీ నేతలపై వరుస దాడులు జరుగుతున్నాయన్నారు. శాంతి భద్రతలు కాపాడలేకపోతే.. డీజీపీ రాజీనామా చేసి వెళ్లిపోవాలన్నారు.

టీడీపీ శ్రేణులపై 1,450 దాడులు జరిగాయని, 23మంది టీడీపీ నేతల్ని పొట్టన పెట్టుకున్నారన్నారు చినరాజప్ప. టీడీపీ నేత తిక్కారెడ్డిపై వైసీపీ మూకల దాడి ఘటనపై ఆపార్టీ సీనియర్‌ నేతలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. అధికారం అడ్డంపెట్టుకుని దాడులకు పాల్పడితే తగిన మూల్యం చెల్లించుకోవలసి ఉంటుందన్నారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే వడ్డీతో సహ తిరిగి చెల్లిస్తామని హెచ్చరించారు

Tags

Read MoreRead Less
Next Story