కుప్పంలో టీడీపీ నాయకులు అరెస్ట్..!

కుప్పంలో టీడీపీ నాయకులు అరెస్ట్..!
టీడీపీ అధినేత చంద్రబాబు కార్యదర్శి మనోహర్‌తో పాటు మరో 9 మంది ముఖ్య నాయకులపై కేసు నమోదు చేశారు.

చిత్తూరు జిల్లా కుప్పంలో టీడీపీ నాయకులను పోలీసులు అరెస్ట్ చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు కార్యదర్శి మనోహర్‌తో పాటు మరో 9 మంది ముఖ్య నాయకులపై కేసు నమోదు చేశారు. నిన్న రాత్రి గొడుగూరు పంచాయతీ బేటగుట్టలో విగ్రహాల ధ్వంసానికి సంబంధించిన కేసు విచారణ సమయంలో కొందరిని పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విచారణ పూర్తయిన తర్వాత తమ విధులకు ఆటంకం కలిగించారనే నెపంతో టీడీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. మరోవైపు తమ పార్టీ శ్రేణులకు.. విగ్రహాల ధ్వంసం కేసుకు ఎలాంటి సంబంధం లేదని... కక్ష సాధింపుతోనే అక్రమ కేసులు నమోదుచేశారని టీడీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి.

Tags

Next Story