TDP: ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసిన జగన్‌

TDP: ప్రాజెక్టుల నిర్వహణను గాలికొదిలేసిన జగన్‌
X
గుండ్లకమ్మ గేటు కొట్టుకోవడానికి ప్రభుత్వమే కారణం... మండిపడ్డ తెలుగుదేశం నేతలు

గుండ్లకమ్మ ప్రాజెక్టులో మరో గేటు కొట్టుకుపోవడం కలకలం రేపుతోంది. జగన్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో కనీస నిర్వహణ లేక ఒక్కో గేటు విరిగిపడుతుండడంతోస్టాప్ గేటు ఏర్పాటుకు అధికారులు కష్టాలు పడుతున్నారు. స్టాప్ లాక్ కింద వరకు వచ్చి పక్కకు వాలిపోవడంతో దాన్ని సరి చేయడానికి సిబ్బంది తంటాలు పడుతున్నారు. మోటార్లు నడవడానికి.... త్రీ ఫేస్ విద్యుత్తు సరఫరా లేనందున పనులకు అంతరాయం కలుగుతోంది. ప్రస్తుతం ప్రాజెక్ట్ లో దాదాపు రెండున్నర TMCల నీటి నిల్వ ఉంన్నందున..నీటి ఉద్ధృతి ఎక్కువగా ఉంది. నీటి ప్రవాహం, నిల్వలు తగ్గితేనే స్టాప్ లాక్ ఏర్పాటు చేయగలమని నిపుణులు చెబుతున్నారు. ఈ కారణంగా అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని బయటకు పంపిస్తున్నారు. అటు గేటు విరిగి ప్రాజెక్టులోని నీరంతా వృథాగా సముద్రంలోకి పోతుండడంపై . ప్రతిపక్ష నేతలు మండిపడుతున్నారు. జనసేన నేతలతో కలిసి... ప్రాజెక్టు ప్రాంతాన్ని పరిశీలించిన తెలుగుదేశం నేతలు....... అధికారులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. గత ఏడాది మూడో గేటు కొట్టుకుపోయినపుడు నెల రోజుల్లో కొత్త గేటు ఏర్పాటు చేస్తామన్న ప్రభుత్వం ఆ హామీని మరిచిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.


ఆంధ్రప్రదేశ్‌లోని ప్రాజెక్టుల నిర్వహణను సీఎం జగన్‌ గాలికొదిలేశారని తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. జగన్ రెడ్డి అసమర్థ పాలనతో ప్రకాశం జిల్లాలోని గుండ్లకమ్మ ప్రాజెక్టు గేట్లు ఊడి నీరు వృథాగా పోతోందని దుయ్యబట్టారు. తాడేపల్లి ప్యాలెస్ నుంచి బయటకు రాకుండా తమపై నిందలు వేయడమేంటని ప్రశ్నించారు. టీఎంసీ.. క్యూసెక్కు.. ఈ రెండింటికీ తేడా తెలియని వారికి నీటిపారుదల శాఖ కట్టబెట్టారని ఎద్దేవా చేశారు. ప్రభుత్వ తీరు మారకపోతే ప్రాజెక్టుల దగ్గర ఆందోళనలు చేపడతామని అచ్చెన్నాయుడు హెచ్చరించారు.


గుండ్లకమ్మ ప్రాజెక్ట్ నిర్వహణ తీరు సక్రమంగా లేదని మండిపడ్డారు అద్దంకి టీడీపీ ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. రాష్ట్రంలోని నీటి ప్రాజెక్టుల భద్రతపై ప్రభుత్వానికి చిత్తశుద్ది లేదన్న ఆయన.. ప్రాజెక్టుల భద్రత ఆందోళన కలిగిస్తుందన్నారు. గత ఏడాదిలో గుండ్లకమ్మ ప్రాజెక్ట్ గేటు, అన్నమయ్య ప్రాజెక్ట్ గేట్లు కొట్టుకోపోయినా వాటిని ఇంతవరకు ఈ ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోవడం శోచనీయం అన్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి తెలిసింది నాణ్యత లేని మధ్యం అమ్మడం, ఇసుక అక్రమ రవాణా ద్వారా దోచుకోవడం.. ఇసుక అక్రమ రవాణా ద్వారా వైసీపీ నేతలు వెయ్యి కోట్లు దోచుకున్నారని ఆరోపణలు గుప్పించారు. బాపట్ల జిల్లాలో భారీ ఎత్తున వర్షాలు సంభవించగా రైతులకు తీవ్ర నష్టం జరిగినా ఆడుకోవటంలో ప్రభుత్వం విఫలం అయ్యిందన్నారు.

గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణ వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోంది. గతేడాది రిజర్వాయర్ మూడో గేటు కొట్టుకుపోగాశుక్రవారం రాత్రి స్పిల్ వే రెగ్యులేటర్‌కు సంబంధించిన మరో గేటు కొట్టుకుపోయింది. ప్రత్యామ్నాయంగా స్టాప్ లాక్‌ ఏర్పాటు చేసేందుకు అధికారులు 3 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నారు.

Tags

Next Story