TDP: దొంగ ఓట్ల వెనక ఉన్నది త్యాడేపల్లి ప్యాలేస్సే

TDP: దొంగ ఓట్ల వెనక ఉన్నది త్యాడేపల్లి ప్యాలేస్సే
డేటా మొత్తాన్ని ఐప్యాక్ గుప్పిట్లో ఉంచుకున్నారని ఆరోపణ

ఆంధ్రప్రదేశ్‌లో దొంగ ఓట్ల వెనుక కథ, స్క్రీన్ ప్లే మొత్తం తాడేపల్లి ప్యాలెస్సేనని తెలుగుదేశం ఆరోపించింది. రామ్ ఇన్ ఫో 'ఫీల్డ్ ఆపరేటింగ్ ఏజెన్సీ' పేరుతో...నాలుగేళ్లుగా దొంగ ఓట్ల కార్యక్రమం చేస్తున్నారని టీడీపీ అధికార ప్రతినిధి విజయ్ కుమార్ ఆరోపించారు. వాలంటీర్లపై అజమాయిషీ చేస్తూడేటా మొత్తాన్ని ఐప్యాక్ గుప్పిట్లో ఉంచుకున్నారనితెలిపారు. వైకాపాకు వ్యతిరేకంగా ఉన్న ఓట్లను తొలగిస్తున్నారని విమర్శించారు. మరోవైపు బాపట్ల జిల్లా చీరాల నియోజకవర్గంలో తప్పులతడకగా ఉన్న ఓటర్ల జాబితాలోసమగ్ర పరిశీలన తర్వాత కూడా అవే తప్పులు పునరావృతమయ్యాయి. పాత జాబితాలో ఉన్నవే..చాలా వరకు ఉండడంతో అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరణించిన వారి పేర్లు గుర్తించి...... తొలగించాలని సిఫార్సు చేశామని బూత్ స్థాయి అధికారులు చెబుతున్నారు. కానీ వారి పేర్లు చాలా వరకు తొలగించలేదు. జీరో డోర్ నంబర్లతో ఓట్లు ఉన్నాయని, వీటిని తొలగించాలని రాజకీయ పార్టీలు విన్నవించినా పట్టించుకోలేదు. ఎన్నికల కమిషన్ ఆదేశాలతో.... ఆగస్టు 21 నుంచి నెల రోజులు..ఇంటింటా పరిశీలన నిర్వహించారు. చాలాచోట్ల BLOలు ఇంటింటికీ తిరగలేదని ఆరోపణలు వచ్చాయి. ప్రస్తుతం ముసాయిదా జాబితా పరిశీలిస్తే ఇది నిజమనే దానికి బలం చేకూరుతోంది. చీరాల నియోజకవర్గంలోని బూత్ నంబరు 24లో అంకిరెడ్డి కావూరి, జాజిరెడ్డి కావూరి, శ్రీనివాస రెడ్డి, వెంకటలక్ష్మి కావూరి, అంకిరెడ్డి కావూరికి జీరో ఇంటి నంబర్లతో ఓట్లు ఉన్నాయి. పోలింగ్ కేంద్రంలో 37లో దాదాపు 75 మందికి జీరో డోర్ నెంబర్ తో ఓట్లు ఉన్నాయి. వేటపాలెం బండ్ల బాపయ్య హిందూ జూనియర్ కళాశాలలో పోలింగ్ స్టేషన్ నంబరు 202లో 29 మంది మృతులకు ఓటు కల్పించారు. ఇంటింటా సర్వేకు ముందు జాబితా ఎలా ఉందో ప్రస్తుతం వచ్చిన ముసాయిదాలోనూ అదే పరిస్థితి నెలకొంది. బూత్ నెంబరు 24లో..కొందరికి రెండేసి ఓట్లు కల్పించారు. సంబంధిత అధికారులు ఇప్పటికైనా పరిశీలించి... తప్పులు పునరావృతం కాకుండా చూడాలని రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నాయి.

మరోవైపు ఆరోగ్యశ్రీ నెట్ వర్క్ హాస్పటల్స్ కు 6 నెలలుగా జగన్ సర్కారు.. 1000 కోట్ల బకాయిలు పెట్టినందున వైద్యసేవలు నిలిపేస్తామని ఏపీ స్పెషాలిటీ హాస్పటల్స్ అసోసియేషన్..లేఖ రాయడం రాష్ట్రంలో పరిస్థితికి అద్దం పడుతోందని టీడీపీ జాతీయ కార్యదర్శి లోకేష్ అన్నారు. కరోనా సమయంలో ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే ఆరోగ్యశ్రీ సేవలు అందించట్లేదని బోర్డులు పెట్టినపుడే జగన్ పనితనం ఏంటో ప్రజలకు అర్థమైందని ధ్వజమెత్తారు. నాలుగున్నరేళ్లుగా అస్తవ్యస్తమైన ఆర్థిక విధానాలతో ట్రిపుల్ A ప్లస్ గా ఉన్న రాష్ట్ర పరపతిని ట్రిపుల్ B ప్లస్ కు దిగజార్చారని మండిపడ్డారు. ఇప్పుడు ఆరోగ్యశ్రీ పథకానికి నిధులు కేటాయించకుండా లక్షలాది ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నెట్ వర్క్ ఆసుపత్రులకు చెల్లించాల్సిన బకాయిలను తక్షణమే విడుదల చేసి పేదలకు ఆరోగ్యశ్రీ సేవలు కొనసాగేలా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని లోకేష్ డిమాండ్ చేశారు.

Tags

Read MoreRead Less
Next Story