TDP: రాయి దాడి ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి

TDP: రాయి దాడి ఘటనపై సీబీఐతో విచారణ చేయించాలి
వర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్‌ను కలిసిన టీడీపీ నేతలు... జగన్‌కు భారీ భద్రత

సీఎం జగన్ పై రాయి దాడి అంతా డ్రామా అని తెలుగుదేశం సీనియర్ నేతలు వర్ల రామయ్య, షరీఫ్ ఆరోపించారు. ఈ అంశంపై గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ను కలిసిన NDA కూటమి నేతలు చంద్రబాబు, పవన్ పై జరిగిన రాళ్ల దాడి ఘటనను వివరించారు. జగన్ రాయి దాడిపై విజయవాడ సీపీతో కాకుండా. సీబీఐతో విచారణ జరిపించాలని గవర్నర్ ను కోరారు. సిట్ కార్యాలయం వద్ద కీలకపత్రాల దహనంపైనా గవర్నర్ కు నేతలు ఫిర్యాదు చేశారు.

జగన్‌కు భారీ భద్రత

ఇటీవల దాడి నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ భద్రతలో మార్పులు, చేర్పులు చేశారు. ప్రస్తుత భద్రతకు అదనంగా సెక్యూరిటీని ఏర్పాటు చేయగా.. బస్సు యాత్ర మార్గాల్లో డీఎస్పీ లతో భద్రత కల్పిస్తారు. సీఎం రూట్ మార్గాలను సెక్టార్లుగా విభజించి.. సెక్టార్‌కు ఒక డీఎస్పీ ఇద్దరు సీఏలు, నలుగురు ఎస్సైలు సెక్యూరిటీ కల్పిస్తారు. ఇకపై నిర్దేశించిన ప్రాంతాల్లోనే సీఎం రోడ్‌షోలు, సభలు ఉండనుండగా.. గజమాలలు, పువ్వులు విసరడంపై ఆంక్షలు అమల్లో ఉంటాయి.


సీఎం జగన్‌పై రాయితో దాడి చేసిన కేసుపై పోలీసులు కీలక ప్రకటన చేశారు. దాడి చేసిన వారి వివరాలు తెలిపిన వారికి రూ.2లక్షల నగదు బహుమతి ఇస్తామని ప్రకటించారు. వివరాలు తెలిస్తే 9490619342, 9440627089 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా పోలీసులు కోరారు. రాయి దాడి ఘటనపై సీఎం జగన్ తొలిసారి స్పందించారు. విజయవాడ సమీపంలోని కేసరపల్లి వద్ద తనను పరామర్శించేందుకు వచ్చిన నేతలతో మాట్లాడుతూ.. ‘బస్సు యాత్రకు వస్తున్న ఆదరణ చూసే దాడులు చేస్తున్నారు. ప్రజల ఆశీర్వాదం వల్ల ప్రాణాపాయం తప్పింది. మరోసారి అధికారంలోకి వస్తున్నాం.. ఆందోళన వద్దు. ఎలాంటి దాడులూ నన్ను ఆపలేవు. ధైర్యంతో ముందడుగు వేద్దాం’ అని పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి జగన్‌పై రాయితో దాడి చేసిన కేసులో నిందితులను పట్టుకునేందుకు విజయవాడ పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. ఈ కేసు దర్యాప్తు కోసం పశ్చిమ డీసీపీ హరికృష్ణ నేతృత్వంలో 20 మందితో కూడిన ప్రత్యేక బృందం ఏర్పాటైంది. ఇందులో ఆరు బృందాలు పనిచేస్తున్నాయి. లా అండ్‌ ఆర్డర్‌, సీసీఎస్‌, టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు సభ్యులుగా ఉన్న ఈ బృందాలు ఆధారాల కోసం అన్వేషణ ప్రారంభించాయి. ముందుగా సీఎంపై దాడి జరిగిన ఘటనా ప్రాంతంలో కేంద్ర బలగాలను మోహరించారు. ఘటన అనంతరం అర్ధరాత్రి దాటాక నగర సీపీ కాంతిరాణా ఆ ప్రాంతాన్ని పరిశీలించారు. పోలీసు అధికారులతో కలిసి పరిసరాలను నిశితంగా గమనించారు. ఎటు వైపు నుంచి దాడి జరిగి ఉండవచ్చన్నది పరిశీలించారు. చుట్టుపక్కల ఉన్న జనం ఎవరైనా సెల్‌ఫోన్లతో చిత్రీకరించి ఉన్నారేమే అని ఆరా తీయాలని ఆదేశించారు. కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నట్లు, ఒకటి, రెండు రోజుల్లో కేసు దర్యాప్తు కొలిక్కి వచ్చే అవకాశం ఉందని పోలీసు కమిషనర్‌ చెబుతున్నారు. అదుపులోకి తీసుకున్న అనుమానితుల్లో ఒక రౌడీషీటర్‌ ఉన్నట్లు తెలిసింది.

Tags

Read MoreRead Less
Next Story