Andhra Pradesh: విస్కీల్లో విష పదార్ధాలు..? బయటపెట్టిన టీడీపీ నేతలు..

Andhra Pradesh: ఏపీలోని ప్రభుత్వ దుకాణాల్లో లభించే మద్యంలో ప్రాణాలు తీసే విష పదార్ధాలు ఉన్నాయంటోంది టీడీపీ.. వీటికి సంబంధించిన ల్యాబ్ నివేదికలను నేతలు బయటపెట్టారు.. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో లభించే సిల్వర్ స్పయిప్స్, ఆంధ్రా గోల్డ్, నైన్ సీ హార్స్ విస్కీల్లో విషపదార్థాలు ఉన్నాయనే ల్యాబ్ నివేదికలను మీడియా ముందుంచారు టీడీపీ నేతలు.. ఆయా బ్రాండ్ మద్యం సీసాలను ప్రదర్శించారు..
వీటిని ఏపీలోని వివిధ ప్రాంతాల్లో మద్యం షాపుల్లో సేకరించి టెస్టులు చేయించామని చెప్పారు.. ఆంధ్రా గోల్డ్, నైన్ సీ హార్స్ విస్కీల్లో వైరాగేలాల్, ఐసోఫ్లోరిక్ యాసిడ్ కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయన్నారు.. సిల్వర్ స్ట్రైప్స్ బ్రాండ్‌లో ఈ రెండింటితోపాటు డై ఇథేల్ ప్యాలెట్ కెమికల్ కాంపౌండ్స్ ఉన్నాయన్నారు.. వీటిని తాగిన వారు దీర్ఘకాలంలో చాలా దారుణమైన పరిస్థితులు ఎదుర్కొంటారని అన్నారు.
మద్య నిషేధం హామీతో అధికారంలోకి వచ్చిన జగన్ రెడ్డి నాసిరకం బ్రాండ్స్‌తో మహిళల తాళిబొట్లు తెంచుతున్నారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పంచుమర్తి అనురాధ మండిపడ్డారు.. ప్రాణాలు తీసే విషపూరిత మద్యాన్ని అమ్ముతూ తాడేపల్లి ప్యాలెస్‌లో లెక్కలు వేసుకుంటున్నారని ఫైరయ్యారు. రాష్ట్రంలో లభించే మద్యం తాగుతున్న వారి ఆరోగ్యం దశలవారీగా క్షీణిస్తోందని టీడీపీ అధికార ప్రతినిధి, మద్యంపై సైంటిఫిక్ రీసెర్చ్‌చేసిన వరుణ్ అన్నారు..
ప్రభుత్వ మద్యం దుకాణాల్లోనే వీటిని సేకరించి టెస్టులు చేయించామన్నారు.. ఈ కెమికల్ కాంపౌండ్స్ ముమ్మాటికీ ప్రాణాంతకమేనన్నారు.. ప్రాణాంతంకం కాదని ప్రభుత్వం నిరూపించగలదా అని వరుణ్ ప్రశ్నించారు. ఎలైట్ మద్యం దుకాణాల్లో సైతం డిజిటల్ లావాదేవీలను ఎందుకు ప్రవేశపెట్టడం లేదని ప్రశ్నించారు టీడీపీ అధికార ప్రతినిధి ఆనం వెంకట రమణారెడ్డి..
మద్యం ఆదాయాన్ని తాకట్టు పెట్టి 35వేల కోట్ల అప్పు తెచ్చిన హాఫ్ టికెట్ జగన్ రెడ్డి అంటూ సెటైర్లు వేశౄరు. 35వేల కోట్ల అప్పు తిరిగి కట్టాల్సినప్పుడు మరో పాతికేళ్లు మద్య నిషేధం ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. మరోవైపు ప్రాణహాని లేదంటూ ఇటీవల ప్రభుత్వం ఇచ్చిన వివరణ బూటకమని టీడీపీ నేతలు ఆరోపించారు. అలాంటి విష పదార్ధాలు లేవని ప్రభుత్వం నిరూపించాలని వారు డిమాండ్ చేశారు..
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com