Narayana Arrest : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ని ఖండించిన టీడీపీ నేతలు..

Andhra Pradesh : మాజీ మంత్రి నారాయణ అరెస్ట్‌ను ఖండించారు పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి కక్ష సాధింపులు, అక్రమ కేసులు తప్ప అభివృద్ధి లేదన్నారు. గతంలో కూడా టీడీపీ నేతలపై ఇలాగే అక్రమ కేసులు బనాయించారని ఆరోపించారు. లీకేజీ వ్యవహారంలో 60 మంది టీచర్లను అరెస్ట్ చేశారని, ఆ శాఖకు బాధ్యత వహించే విద్యాశాఖమంత్రి బొత్సను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు.
కక్ష సాధింపుతోనే మాజీ మంత్రి నారాయణను అరెస్ట్ చేశారన్నారు తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ. వయస్సు పైబడిన వ్యక్తిని వందల కిలోమీటర్లు కారులో తీసుకురావడం ఏంటంటూ ప్రశ్నించారామె. నారాయణకు ఎదైనా జరిగితే ప్రభుత్వమే బాధ్యత వహించాలన్నారు. నారాయణ అరెస్ట్‌ను ఖండిస్తూ.. తిరుపతిలో టీడీపీ నేతలు నిరసనకు దిగారు.
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ ఖండించారు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యులు కిమిడి కళా వెంకటరావు. జగన్ సర్కారు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తోందంటూ మండిపడ్డారు. అందుకే నారాయణను అరెస్ట్ చేసిందన్నారు. నారాయణను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
మాజీ మంత్రి నారాయణ అరెస్ట్ దారుణమన్నారు మాజీ ఎంపీ నెలవల సుబ్రమణ్యం. ఈ అరెస్ట్‌కు వ్యతిరేకంగా సూళ్లూరుపేట నియోజకవర్గ టీడీపీ నేతలతో నిరసన కార్యక్రమం చేపట్టారు. తప్పుడు సాక్ష్యాలు సృష్టించి అరెస్ట్ చేశారంటూ మండిపడ్డారు. నారాయణను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com