విస్తృత స్థాయిలో టీడీపీ సమావేశం..

విస్తృత స్థాయిలో టీడీపీ సమావేశం..
అమరావతి కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది

కాసేపట్లో టీడీపీ విస్తృత స్థాయి సమావేశం ప్రారంభం కానుంది. అమరావతి కేంద్ర కార్యాలయంలో టీడీపీ అధినేత చంద్రబాబు అధ్యక్షతన ఈ భేటీ జరగనుంది. మహానాడులో ప్రకటించిన టీడీపీ మేనిఫెస్టో భవిష్యత్‌కు గ్యారెంటీ ప్రచార కార్యక్రమంలో భాగంగా ఐదు జోన్లకు ఐదు బస్సులను చంద్రబాబు ప్రారంభించనున్నారు. ఈ నెల 21 నుంచి ఈ బస్సు యాత్ర ప్రారంభం కానుంది. ఇక బస్సు యాత్రలో నేతలు అనుసరించాల్సిన అంశాలపై ఈ భేటీ చర్చించనున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నేతలకు దిశానిర్ధేశం చేయనున్నారు. వైసీపీ వైఫల్యాలను ఎండగట్టడంతో పాటు టీడీపీ అధికారంలోకి వచ్చాక చేసే అభివృద్ధి, సంక్షేమ పథకాల గురించి ప్రజలకు వివరించేలా కార్యచరణ సిద్ధం చేయనున్నారు.

మరోవైపు మధ్యాహ్నం బాపట్ల జిల్లా ఉప్పలవారిపాలెంకి వెళ్లనున్నారు చంద్రబాబు. ఇటీవల హత్యకు గురయిన బాలుడు అమర్నాథ్‌ కుటుంబ సభ్యులను చంద్రబాబు పరామర్శించనున్నారు. ఏపీలో జరుగుతున్న ఘోరాలు, నేరాలపై రాష్ట్ర ప్రజలకు టీడీపీ ఇప్పటికే బహిరంగ లేఖ రాశారు. వైసీపీ పాలనలో రాష్ట్రం నేరాంధ్రప్రదేశ్‌గా మారిపోయిందన్నారు.బాపట్ల జిల్లాలో బాలుడి సజీవ దహనం సహా పలు అంశాలను ప్రస్తావిస్తూ చంద్రబాబు లేఖ విడుదల చేశారు. సీఎం వైఖరి, ప్రభుత్వ అసమర్థత నేరగాళ్లకు మరింత ఊతం ఇచ్చేలా ఉందని లేఖలో పేర్కొన్నారు. గత మూడు రోజుల్లో జరిగిన నాలుగు అంశాలు ప్రస్తావిస్తూ రాష్ట్ర పరిస్థితిపై ప్రజలు ఆలోచన చేయాలని చంద్రబాబు కోరారు. మహిళలకు భద్రత లేదు, ఆస్తులకు రక్షణ లేదు, చట్ట సభల్లో గౌరవం లేదు, రాష్ట్రంలో శాంతి భద్రతలు లేవంటూ లేఖలో ఘాటైన అంశాలను పేర్కొన్నారు.

Tags

Read MoreRead Less
Next Story