RRR: డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతల స్వీకరణ

ఏపీ శాసనసభ డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నికైన రఘురామకృష్ణరాజును స్పీకర్ అయ్యన్నపాత్రుడు, సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ స్పీకర్ స్థానంలో కూర్చోబెట్టారు. దీంతో ఆయన డిప్యూటీ స్పీకర్‌గా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా రఘురామను చంద్రబాబు, పవన్, అయ్యన్నపాత్రుడు అభినందించారు. అనంతరం టీడీపీ, జనసేన, బీజేపీ ఎమ్మెల్యేలు స్పీకర్ స్థానం వద్దకు వెళ్లి ఆయనకు అభినందనలు తెలిపారు. ‘ఆర్‌ఆర్‌ఆర్’ ఎంత సంచలనం సృష్టించిందో.. రాజకీయాల్లో డిప్యూటీ స్పీకర్ రఘురామ అంత సంచలనం సృష్టించాలని సీఎం చంద్రబాబు అన్నారు. డిప్యూటీ స్పీకర్‌గా రఘురామ బాధ్యతలు చేపట్టిన తర్వాత అసెంబ్లీలో సీఎం మాట్లాడారు. తెలుగుబిడ్డగా పంచెకట్టులో వచ్చిన రఘురామ.. స్పీకర్ స్థానానికి నిండుతనం తీసుకొచ్చారు. కొత్త పదవిలో ఆయన్ని చూస్తే సంతోషంగా ఉందన్నారు.
రఘురామ ప్రస్థానమిది..
ఆంధ్రాయూనివర్సిటీలో మాస్టర్ ఆఫ్ ఫార్మసీలో రఘురామ డిస్టెన్షన్‌లో పాస్ అయ్యారు. ఎడిబుల్ ఆయిల్‌లో కూడా ఆయన వ్యాపారం చేశారు. అప్పట్లో సిరీస్ ఫార్మాను ఆయన స్ధాపించారు. డిప్యూటీ స్పీకర్ 2019లో నరసాపూర్ ఎంపీగా పోటీ చేసి గెలిచారు. " ఏదైనా ఫ్రాంక్‌గా రఘురామ మాట్లాడుతారు. ఎక్కడైనా తప్పులు ఉన్నప్పడు కుండబద్దలు కొట్టినట్టు చెబుతారు. అదే రఘరామకు ఇబ్బందులు తెచ్చింది. జగన్ ప్రభుత్వం ఏపీలో టెర్రరిజన్ని స్పాన్సర్ చేసింది. అధినేత నిర్ణయాలతో విభేదించినప్పుడు కావాలంటే పార్టీకి దూరంగా ఉంటారు. అయితే రఘురామపై జగన్ ఏవిధంగా కుట్రపన్నారో చూశాం.ముందు బెదిరించారు తర్వాత బయపెట్టారు. ఏకపక్షంగా తన సొంత ఎంపీపై లేని రాజద్రోహం కేసును నమోదు చేసి 2021మే 14న ఆయన పుట్టిన రోజున అరెస్టు చేసి పైశాచిక ఆనందం పొందాలని అరెస్టు చేశారు. ఒక ఎంపీని పోలీసు కస్టడీలో టార్చర్ చేయడం సీఐలు, ఐపీఎస్ అధికారులు దీనిలో పాల్గొనడం ఇదే దేశంలో మొదటిది, ఆఖరు సంఘటన కావాలి. నర్సాపూర్ లోక్‌సభ పరిధిలో అల్లూరి సీతారామరాజు విగ్రహం ఆవిష్కరించారు. విగ్రభా ఆవిష్కరణకు వెళ్లాలనుకుంటే రఘురామను వెళ్లనీయలేదు. ఆయన వెళ్తే పిడుగురాళ్ల, సత్తెనపల్లిలో రైళ్లను తగులబెట్టాలని కుట్ర చేశారు. నియోజకవర్గానికి ఆయనను రానీయకపోతే చివరకు రచ్చబండ పెట్టి ప్రజలకు జరిగిన విషయం చెప్పి వారి ఆదరణ పొందారు’’ అని సీఎం చంద్రబాబు అన్నారు.
పవన్ ప్రశంసలు
మరోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా రఘురామపై ప్రశంసల జల్లు కురిపించారు. తాను రీల్ హీరోనని, కానీ రఘురామ రియల్ హీరో అని ఆయన పోరాటాన్ని గుర్తుచేస్తూ పవన్ తెలిపారు. దెబ్బలు తిన్నా, చంపుతామని బెదిరించినా, ధైర్యంతో నిలబడ్డ రఘురామ రియల్ లైఫ్ లో హీరో అన్నారు. రఘురామను శారీరకంగా మానసికంగా వేధించారని, మిమ్మల్ని అడుగుపెట్టనీయమని ఛాలెంజ్ చేసినవాళ్లు ఇప్పుడు అడుగుపెట్టలేని పరిస్థితి వచ్చిందన్నారు. ఇదే కర్మ అంటే అన్నారు. డిప్యూటీ స్పీకర్ గా సహనం కోల్పోకుండా సభా గౌరవాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని రఘురామకు సూచించారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com