Ap Assembly : తొలిరోజే సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు ..!

Ap Assembly : ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలిరోజే సభలో తీవ్ర గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్ విశ్వభూషణ్ హరిచందన్ ఇలా ప్రసంగం మొదలుపెట్టారో లేదో.. TDP సభ్యులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. రాజ్యాంగ వ్యవస్థల్ని కాపాడలేని గవర్నర్ 'గో బ్యాక్' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ నిరసనలపై CM జగన్ అసహనం వ్యక్తం చేశారు.
ఐనా.. విపక్ష సభ్యులు తగ్గలేదు. రెట్టించిన స్థాయిలో నినాదాలతో హోరెత్తించారు. ఓ దశలో గవర్నర్ ప్రసంగ ప్రతుల్ని చించేసి గాల్లో ఎగరేసి నిరసన తెలిపారు. ప్రసంగం ప్రారంభం నుంచి చివరి వరకూ కూడా తెలుగుదేశం సభ్యుల ఆందోళన కొనసాగింది. కొంత మంది సభ్యులు తమ స్థానాల నుంచి పోడియం వైపునకు వచ్చి మరీ 'గో బ్యాక్ గవర్నర్' అంటూ ఆందోళనలు కొనసాగించారు. కాసేపటి తర్వాత గవర్నర్ ప్రసంగాన్ని బహిష్కరించి సభ నుంచి తెలుగు దేశం సభ్యులు వాకౌట్ చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com