Pattabhi Ram: పట్టాభిరామ్‌కు 14 రోజుల రిమాండ్..

Pattabhi Ram (tv5news.in)
Pattabhi Ram: టీడీపీ అధికార ప్రతినిధి పట్టాభిరామ్‌కు 14 రోజుల రిమాండ్ విధించింది విజయవాడ మూడో అదనపు చీఫ్ మెట్రోపాలిటన్ కోర్టు. నవంబర్ 4 వరకు రిమాండ్ విధించారు న్యాయమూర్తి. మరోవైపు ఇదే కోర్టులో బెయిల్ పిటీషన్ సైతం దాఖలు చేశారు పట్టాభి. విజయవాడ ప్రభుత్వాసుపత్రిలో. వైద్యపరీక్షల అనంతరం ఇవాళ కోర్టులో హాజరుపరిచారు పోలీసులు.
ఇరు వర్గాల వాదనలు విన్నారు న్యాయమూర్తి. ఈ సందర్భంగా పట్టాభి పోలీసుల తీరు గురించి కోర్టుకు వివరించారు. రాత్రి తమ ఇంటి తలుపులు పగులగొట్టి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. రికార్డులపై ఉదయం తనతో సంతకాలు పెట్టించుకున్నారని రికార్డుల్లో మాత్రం నిన్న రాత్రి అన్నట్లుగా రాశారని జడ్జికి తెలిపారు. తాను సీఎంను గాని, ప్రభుత్వ పెద్దలను గానీ తులనాడలేదని.. టీడీపీ అధికార ప్రతినిధిగా ప్రభుత్వ లోపాలను ఎత్తి చూపానన్నారు.
ఆన్ రికార్డు మీడియా సమావేశంలో వాస్తవాలు వివరించానని.. రికార్డులు కూడా పరిశీలించాలని విజ్ఞప్తి చేశారు. మొన్న తన ఇంటిపై వైసీపీ కార్యకర్తలు దాడి చేసిన ఫర్నిచర్ ధ్వంసం చేశారని కోర్టు దృష్టి తీసుకొచ్చారు. తనకు ప్రాణహాని ఉందని భయం కలుగుతోందని, తనపై అన్యాయంగా పోలీసులు కేసులు నమోదు చేశారని న్యాయమూర్తికి తెలిపారు. గతంలో కూడా తనపై దాడి జరిగినా నిందితుల్ని పట్టుకోలేదన్నారు. నిన్న రాత్రి నుంచి తొట్లవల్లూరు పీఎస్‌లో తనను ఉంచారని అయితే పోలీసులు కొట్టలేదన్నారు పట్టాభి.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com