TDP : ఎల్లుండి టీడీపీ పొలిట్‌బ్యూరో భేటీ.. నామినేటెడ్ పదవులపై చర్చ
By - Manikanta |6 Aug 2024 2:00 PM GMT
టీడీపీ అధినేత, సీఎం చంద్రబాబు ( N. Chandrababu Naidu ) అధ్యక్షతన ఈ నెల 8న పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది. మంగళగిరిలో పార్టీ కేంద్ర కార్యాలయంలో ఈ భేటీ జరగనుంది. నామినేటెడ్ పదవుల పంపకం, పార్టీ సంస్థాగత వ్యవహారాలు, సభ్యత్వ నమోదు తదితర అంశాలపై సీనియర్ నేతలు చర్చించనున్నారు. అలాగే విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపై నిర్ణయం తీసుకోనున్నారు. నామినేటెడ్ పదవుల భర్తీ, పార్టీ సంస్థాగత వ్యవహారాలపై చర్చ జరగనున్నట్లు సమాచారం. విశాఖ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థిపైనా నిర్ణయం తీసుకోనున్నారు. ఉప ఎన్నిక బరిలో కూటమి తరఫున తమ అభ్యర్థిని నిలబెట్టాలని నిర్ణయించారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com