Varla Ramaiah : ఏపీ సీఎస్‌కు టీడీపీ పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ

Varla Ramaiah : సీఎం జగన్ రెండున్నరేళ్ల పాలనపై సీఎస్ సమీర్ శర్మకు లేఖ రాశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య. దళితులను అన్ని విధాలా వంచించారని లేఖలో పేర్కొన్నారు. అసత్య మాటలు, అబద్ధపు వాగ్దానాలతో దళితులను మధ్య పెట్టి అధికారంలోకి వచ్చారని అన్నారు. 30 నెలల పాలనలో 29 ఎస్సీ, ఎస్టీ పథకాలను రద్దు చేసి, 26 వేల 663 కోట్ల సబ్ నిధులను దారి మళ్లించారని ఆరోపించారు. ఆ నిధులను తిరిగి ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం ఖర్చు చేసేలా చర్యలు తీసుకోవాలని లేఖ ద్వారా సీఎస్‌ను కోరారు వర్ల రామయ్య. ఇక ఎస్సీ, ఎస్టీలకు చెందిన 12 వేల ఎకరాల అసైన్డ్ భూములను ప్రభుత్వం అన్యాయంగా లాక్కుందని మండిపడ్డారు. ప్రధాన మంత్రి ఆదర్శ్ గ్రామ యోజన లాంటి కేంద్ర ప్రాయోజిత పథకాన్ని జగన్ నిర్వీర్యం చేశారని విమర్శించారు. దళితులపై 157 సార్లు దాడులు జరిగినా... ఇప్పటి వరకు ఒక్కరికి కూడా న్యాయం చేయలేదని లేఖలో పేర్కొన్నారు వర్ల రామయ్య.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com