రాజ్యాంగాన్ని ధిక్కరించి మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డిని అరెస్టు చేయాలి : వర్ల

రాజ్యాంగాన్ని ధిక్కరించి మాట్లాడిన మంత్రి పెద్దిరెడ్డిని తక్షణమే అరెస్టుచేయాలని డిమాండ్ చేశారు టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య. అజ్ఞానంతో, అహంకారంతో మాట్లాడిన మంత్రిపై తక్షణమే చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్‌ఈసీ ఆదేశాలను పాటించవద్దని హెచ్చరించడం అధికారులను భయపెట్టడమే అన్నారు. పెద్దిరెడ్డి లాంటి రాజ్యాంగ వ్యతిరేకి.. సభ్య సమాజంలో తిరగడానికి వీల్లేదన్నారు. కలెక్టర్లను మంత్రి బెదిరిస్తుంటే.. ఐఏఎస్ అధికారుల సంఘం ఏం చేస్తుందని వర్ల రామయ్య ప్రశ్నించారు.
రాజ్యాంగ ప్రకారం నడుస్తానని ప్రమాణం చేసిన మంత్రి రామ చంద్రారెడ్డి,ఈరోజు, రాజ్యాంగ వ్యవస్థ అయిన రాష్ట్ర ఎన్నికల కమిషనర్ మాట, రాష్ట్ర అధికారులెవరు వినవద్దని హెచ్చరించడo, రాజ్యాంగ
— Varla Ramaiah (@VarlaRamaiah) February 5, 2021
ధిక్కరనే. మంత్రిగా ఒక్క రోజు కూడా కొనసాగే నైతిక హక్కులేదు.వెంటనే గవర్నర్ ఆయనను బర్తరఫ్ చెయ్యాలి
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com