AP TDP : ఏపీ వ్యాప్తంగా ఇవాళ టీడీపీ నిరసనలు..!

AP TDP :  ఏపీ వ్యాప్తంగా ఇవాళ టీడీపీ నిరసనలు..!
AP TDP : ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడుతోందని.. దీనికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను సమర్పించాలని టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది.

AP TDP : ఏపీ వ్యాప్తంగా ఇవాళ టీడీపీ నేతలు నిరసనలు చేపట్టనున్నారు. ఓటీఎస్‌ పేరుతో ప్రభుత్వం పేదల నుంచి వసూళ్లకు పాల్పడుతోందని.. దీనికి వ్యతిరేకంగా అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్ విగ్రహాలకు వినతిపత్రాలను సమర్పించాలని టీడీపీ అధిష్టానం పిలుపునిచ్చింది. అంబేద్కర్ వర్థంతి సందర్భంగా నివాళులర్పించిన.. అనంతరం అంబేద్కర్‌ పాదాల వద్ద వినతిపత్రం ఉంచుతారు. పేదల ఇళ్లపై ఓటీఎస్ కడితేనే పథకాలు అమలు చేస్తామని వైసీపీ నాయకులు, అధికారులు పేదలను ఒత్తిడి చేయడాన్ని ఖండించాలని పిలుపునిచ్చింది అధిష్టానం. టీడీపీ అధికారంలోకి వచ్చిన నెల రోజుల్లో ఉచితంగా ఇళ్లు రిజిస్ట్రేషన్ చేసి అందిస్తామని పేదలకు భరోసా ఇవ్వాలని పేర్కొంది.

ఓటీఎస్‌ పేరుతో పేదలను దోపిడీ చేసేందుకు ప్రభుత్వం సిద్ధపడడం దుర్మార్గమైన చర్యని టీడీపీ మండిపడుతోంది. 30 ఏళ్ల క్రితం పేదలకు ఇందిరాగాంధీ, ఎన్టీఆర్‌ హయాంలో ఉచితంగా ఇళ్లను కట్టించారని.. ఇప్పుడు వన్‌టైం సెటిల్‌ మెంట్‌ పేరుతో డబ్బులు కట్టాలనడం ఎంతవరకు సబబని ప్రశ్నిస్తోంది. కరోనా వల్ల రెండేళ్ల నుండి ఉపాధి కోల్పోయిన పేదలపై ఇది గొడ్డలిపెట్టు అని అంటోంది. కూలీ, నాలి చేసుకునే వారు ఇప్పటికిప్పుడు గ్రామాల్లో 10వేలు, మున్సిపాలిటీలో 15 కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు టీడీపీ నాయకులు. సచివాలయ సిబ్బంది పేదలపై ఒత్తిడి చేయడం సరికాదన్నారు.

Tags

Read MoreRead Less
Next Story