TDP MOTHA: జగన్‌కు మోత మోగిపోవాలి: బ్రాహ్మణి

TDP MOTHA: జగన్‌కు మోత మోగిపోవాలి: బ్రాహ్మణి
ఇవాళ రాత్రి ఏడు గంటల నుంచి అయిదు నిమిషాల పాటు వినూత్న నిరసన... ఏదో రకంగా మోత మోగించాలన్న బ్రాహ్మణి...

టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు అక్రమ అరెస్టుకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు కొనసాగుతున్న వేళ.... తెలుగుదేశం పార్టీ ఇవాళ(శనివారం) వినూత్న నిరసన కార్యక్రమానికి పిలుపునిచ్చింది. చంద్రబాబుకు మద్దతుగా ఇవాళ రాత్రి 7గంటల నుంచి రాత్రి 7.05 గంటల వరకు ఐదు నిమిషాల పాటు ప్రజలంతా సీఎం జగన్‌కు వినిపించేలా ఏదో ఒక రకంగా మోత మోగించాలని చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి, నారా లోకేశ్‌ సతీమణి నారా బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు వారు ‘ఎక్స్‌’ (ట్విటర్‌)లో వేర్వేరుగా పోస్టులు పెట్టారు.


నియంత ముందు మొర పెట్టుకుంటే సరిపోదని రాష్ట్రమంతటా మోత మోగించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబుకు మద్దతుగా ఈ రోజు రాత్రి 7 గంటలకు 5 నిమిషాల పాటు ఏదో ఒక రకంగా శబ్ధం చేసేయాలని ప్రజలకు పిలుపునిచ్చింది. ఐదు కోట్ల రాష్ట్ర ప్రజల ఆగ్రహాం ఎలా ఉంటుందో ప్యాలస్‌లో ఉన్న సైకో జగన్‌కు వినబడేలా నిరసన తెలపాలని కోరింది. పాలకుల అక్రమాలకు అడ్డు చెప్పకపోవడం ప్రజాస్వామ్యానికి ప్రమాదకరమని, ముఖ్యంగా ప్రజలు మౌనంగా ఉంటే అన్యాయం చెలరేగిపోతుందని నారా బ్రాహ్మణి తెలుగు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. అందుకే ఏపీ ప్రజలకు నా విజ్ఞప్తి! చంద్రబాబు గారి గురించి మీకు బాగా తెలుసు. ఆయన్ను అక్రమంగా నిర్బంధించడం తప్పు అని చెప్పండి. చంద్రబాబుకు మద్దతుగా సెప్టెంబర్ 30, రాత్రి 7 నుండి 7.05 గంటల వరకు 5 నిమిషాల పాటు వీధుల్లోకి వచ్చి గంటలు మోగించండి అని నారా బ్రాహ్మణి పిలుపునిచ్చారు. ఒక పళ్లెం తీసుకుని గరిటెతో కొట్టండి. విజిల్ వేయండి. రోడ్డు ప్రయాణంలో ఉంటే హారన్ కొట్టండి. మొత్తమ్మీద ఏదో ఒక శబ్దం చేసి ప్రభుత్వానికి మీ నిరసన తెలియజేయండి’’బ్రాహ్మణి విజ్ఞప్తి చేశారు.


మరోవైపు చంద్రబాబుని నంద్యాలలో సీఐడీ పోలీసులు అరెస్ట్‌ చేసిన చోటే.... నేడు తెదేపా రాజకీయ కార్యాచరణ కమిటీ సమావేశం నిర్వహించనున్నారు. చంద్రబాబు అరెస్ట్, ప్రభుత్వం పెడుతున్న అక్రమ కేసుల నేపథ్యంలో.... చేపట్టాల్సిన భవిష్యత్‌ కార్యాచరణపై భేటీలో చర్చించనున్నారు. PAC ఏర్పాటైన తర్వాత జరగనున్న రెండో సమావేశం ఇది. లోకేశ్‌ దిల్లీ నుంచే వీడియో కాన్ఫరెన్స్‌ విధానంలో సమావేశంలో పాల్గొననున్నారు. అక్టోబరు 2 నుంచి నిరసనలు తీవ్రం చేసే విధంగా... తెదేపా, జనసేనతో కలిసి ఎలా ముందుకు వెళ్లాలనే విషయంపై కీలక నిర్ణయాలు తీసుకుంటామని అచ్చెన్నాయుడు తెలిపారు. ఎలాంటి ఆధారాలు లేని కేసులో చంద్రబాబును అరెస్ట్ చేశారని.... ఆధారాల కోసం సీఐడీ అధికారులు ఇపుడు అన్వేషణ చేస్తున్నారని మండిపడ్డారు.

Tags

Next Story