Chandrababu Naidu: గేరు మార్చిన టీడీపీ అధినేత

టీడీపీ చీఫ్ గేరు మార్చారు. రోజుకు మూడు,నాలుగు నియోజకవర్గాల ఇన్‌ఛార్జీలతో సమీక్షలు జరుపుతూ వారికి క్లారిటీ ఇస్తున్నారు. ప్రతిరోజు ఉదయం నుంచి అర్ధరాత్రి వరకు చంద్రబాబు నియోజకవర్గాల సమీక్షలు జరుపుతూ నేతలను ఎన్నికల మూడ్ లోకి తీసుకువెళ్తున్నారు. ఇప్పటికే ఓసారి వన్ టు వన్ సమీక్షలు జరిపిన చంద్రబాబు రెండో దఫాలో ఎస్సీ నియోజకవర్గాల సమీక్షలు కూడా పూర్తి చేశారు. మరోవైపు ఏపీలో ఉన్న ఎస్సీ నియోజకవర్గాలపై ఇప్పటికే చంద్రబాబు ఒక క్లారిటీ కి వచ్చారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో సమీక్షలు జరుపుతూ ఇన్‌ఛార్జీలకు డైరెక్షన్ ఇస్తున్నారు. నియోజకవర్గంలో పోటీ ఉన్న చోట మాత్రం మిగతా వారిని పిలిపించి వారికి హామీ ఇచ్చి పార్టీ ఫైనల్ చేసిన ఇన్‌ఛార్జీలతో కలిసి పనిచేయాలని సూచిస్తున్నారు. ఈ నేపధ్యంలో నేతల మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దె ప్రయత్నం చేస్తున్నారు టీడీపీ అధినేత.
ఇక ఏపీలో ఎన్నికలకు పెద్దగా సమయం లేదు.ఏడాదిలోపే ఏపీలో సాధారణ ఎన్నికలు జరగనున్నాయి. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కేడర్ సిద్ధంగా ఉండేలా చంద్రబాబు పెద్ద కసరత్తు చేస్తున్నారు. జిల్లా టూర్లకు కాస్త బ్రేక్ ఇచ్చిన ఆయన పార్టీ కేంద్ర కార్యాలయంలోనూ ఉండవల్లిలోని తన నివాసంలోను సమీక్షలు జరుపుతూ నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌ల లిస్ట్ ఫైనల్ చేస్తున్నారు.అఫీషియల్‌గా బయటికి చెప్పకపోయినా వారికి మాత్రం క్లారిటీ ఇచ్చేస్తున్నారు చంద్రబాబు. ప్రతి ఒక్కరూ ప్రజల్లో ఉండాలని దిశానిర్దేశం చేసి పంపిస్తున్నారు. కొన్నినెలల క్రితమే 175 నియోజకవర్గాలపై ఓసారి సమీక్షలు జరిపారు. ఇప్పుడు మళ్లీ మరోసారి సమీక్షలు చేస్తున్నారు. గత కొద్దిరోజులుగా ఎస్సీ నియోజకవర్గాలపై సమీక్షలు జరిపిన చంద్రబాబు ఎస్సీ నియోజకవర్గాల ఇన్‌చార్జ్‌లతో సమీక్షలు పూర్తి చేయనున్నారు.
మరోవైపు ఎస్సీ నియోజకవర్గాలపై ఇప్పటికే ఓ అవగాహనకు వచ్చిన టీడీపీ అధినేత. పోటీ ఉన్న చోట మాత్రం మిగతా వారిని పిలిపించి నేతల మధ్య ఉన్న విభేదాలను చక్కదిద్దే ప్రయత్నం చేస్తున్నారు. అటు ఇన్‌ఛార్జ్‌లతో పాటు ఇటు పొలీట్ బ్యూరో సభ్యులతో వరుస సమీక్షలు జరుపుతూ నేతల మధ్య ఉన్న విభేదాలకు పులిస్టాప్ పెడుతున్నారు.భవిష్యత్తు గ్యారెంటీ పేరుతో ప్రతి ఒక్క ఇన్‌ఛార్జ్ ఇంటింటికి వెళ్లి టీడీపీ పథకాలను ప్రజలకు వివరించాలని సూచిస్తున్నారు.ఎస్సీ నియోజకవర్గాల్లో సమీక్షలు పూర్తి కావడంతో జనరల్ నియోజకవర్గాలపై చంద్రబాబు ఫోకస్ పెట్టారు .వీలైనంత త్వరగా సమీక్షలు పూర్తి చేసి ప్రజల్లోనే ఉండాలని భావిస్తున్నారు టీడీపీ అధినేత.వచ్చేనెల నుండి భవిష్యత్తు గ్యారంటీ పేరుతో ఎన్నికల వరకు ప్రజల్లోనే ఉండే విధంగా ప్రణాళికలు రూపొందిస్తుంది టీడీపీ.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com