రేపటి 'రాజ్యాంగ పరిరక్షణ దినం' ను విజయవంతం చేయాలి : చంద్రబాబు

రేపు 'రాజ్యాంగ పరిరక్షణ దినం' కార్యక్రమాలకు టీడీపీ పిలుపు ఇచ్చింది. టెలికాన్ఫరెన్స్‌లో కేడర్‌కు రాజ్యంగ పరిరక్షణ దినంపై పిలుపు ఇచ్చారు. గ్రామగ్రామాన జాతీయ పతాకాలను ఆవిష్కరించాలని సూచించారు. భారత రాజ్యాంగ నిర్మాతలకు నివాళులర్పించాలిని.. రాజ్యాంగం కల్పించిన హక్కులు, ప్రాథమిక విధులపై ప్రజల్లో చైతన్యం పెంచాలని కోరారు.
సీఎం జగన్ రెడ్డి ఉన్మాద పాలనపై అందరూ ధ్వజమెత్తాలని.. రాంజ్యాంగ వ్యవస్థలను విచ్చినం చేస్తున్న వైసీపీ చర్యలను గర్హించాలి అన్నారు. బడుగు బలహీన వర్గాల రక్షణ కవచమైన రాజ్యాంగానికే తూట్లు పొడవడాన్ని అంతా ఏక కంఠంతో ఖండించాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
ధర్మాన్ని మనం కాపాడితే.. ధర్మమే మనల్ని కాపాడుతుందని.. అలాగే రాజ్యాంగాన్ని మనం కాపాడితే.. రాజ్యాంగమే మనల్ని కాపాడుతుందని చంద్రబాబు అభిప్రాయపడ్డారు. రేపటి 'రాజ్యాంగ పరిరక్షణ దినం'ను అంతా విజయవంతం చేయాలని చంద్రబాబు పిలుపు ఇచ్చారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com