తాడిపత్రి మున్సిపాలిటీని గెలుచుకున్న టీడీపీ..!

తాడిపత్రి మున్సిపాలిటీని గెలుచుకున్న టీడీపీ..!
అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్‌ గాలి వీచినా సరే.. తాడిపత్రిలో మాత్రం సైకిల్‌ గుర్తు సత్తా చాటింది.

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపాలిటీని టీడీపీ గెలుచుకుంది. రాష్ట్రవ్యాప్తంగా ఫ్యాన్‌ గాలి వీచినా సరే.. తాడిపత్రిలో మాత్రం సైకిల్‌ గుర్తు సత్తా చాటింది. మొత్తం 36 వార్డులకు గాను 18 వార్డులను టీడీపీ కైవసం చేసుకోగా.. మిత్రపక్షం సీపీఐ ఒక వార్డులో గెలిచింది. వైసీపీ 14 వార్డుల్లో గెలుపొందింది. సీపీఐ గెలిచిన వార్డుతో కలిపి మ్యాజిక్ ఫిగర్ 19ని చేరుకోవడంతో టీడీపీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నారు. తాడిపత్రి మున్సిపాలిటీలో విజయం.. జేసీ కుటుంబానికి, జగన్‌కు మధ్య జరిగిన పోరాటంగా అభివర్ణిస్తున్నారు జేసీ వర్గీయులు.

తాడిపత్రిని కాపాడుకోవాలంటూ జేసీ కుటుంబం ఇచ్చిన పిలుపునకు స్థానిక ప్రజలు మద్దతు పలికారను. జేసీ ప్రభాకర్‌ రెడ్డికి ఆరోగ్యం సహకరించకపోయినా.. అన్నీ తానై వ్యవహరించారు. కాలునొప్పి ఉన్నప్పటికీ.. కుంటుతూనే ప్రచారం చేశారు జేసీ. మరోవైపు జేసీ పవన్ కుమార్ రెడ్డి తన ప్రచార సరళితో యువ ఓటర్లను ఆకట్టుకున్నారు. మొత్తానికి తాడిపత్రిలో టీడీపీ గెలుపును జగన్, జేసీ కుటుంబానికి మధ్య జరుగుతున్న పోరుగా అభివర్ణిస్తున్నారు. వైసీపీ అధికారంలోకి వచ్చాక.. జేసీ కుటుంబంపై కక్షసాధింపులు ఎక్కువయ్యాయని స్థానిక ప్రజలే చెబుతున్నారు. జేసీ కుటుంబంపై వరుస కేసులతో ఇబ్బందులు పెట్టడంతో.. తాడిపత్రి ఓటర్లు జేసీ కుటుంబానికి బాసటగా నిలిచారు.

Tags

Read MoreRead Less
Next Story