AP : ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీకి టీడీపీ దూరం
By - Manikanta |13 Aug 2024 9:15 AM GMT
సీఎం చంద్రబాబు అనూహ్య నిర్ణయం తీసుకున్నారు. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో పోటీ చేయట్లేదని ప్రకటించారు. కొన్ని రోజులుగా పోటీలో నిలిపేందుకు ఆయన సమాలోచనలు చేశారు. వైసీపీకి మెజార్టీ సభ్యుల మద్దతు ఉండటంతో పోటీ చేయకపోవడమే మంచిదని నిర్ణయించారు. దీంతో వైసీపీ అభ్యర్థి బొత్స ఎన్నిక లాంఛనమే. స్వతంత్ర అభ్యర్థిగా షేక్ సఫీ నామినేషన్ వేశారు. ఆయన ఉపసంహరించుకుంటే ఎన్నిక ఏకగ్రీవం కానుంది. విశాఖ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికలకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆగస్ట్ 6 నుంచి నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ ప్రారంభమైంది. 13 వరకు నామినేషన్ల దాఖలుకు అవకాశం ఉంది. 14న స్క్రూటినీ, 16న ఉపసంహరణ, 30న పోలింగ్ జరగనుంది. సెప్టెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించనున్నారు.
Next Story
© Copyright 2024 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com