YSRCP : అప్పుడు వంశీ.. ఇప్పుడు జోగి రమేశ్.. అరాచకాలకు అంతే లేదు

వైసీపీ హయాంలో ఆ పార్టీ నేతలు చేసిన అరాచకాలు అన్నీ ఇన్నీ కావు. మరీ ముఖ్యంగా జోగి రమేశ్, వల్లభనేని వంశీ చేసిన దారుణాలు చాలానే ఉన్నాయి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన వెంటనే వీరిని టార్గెట్ చేయలేదు. ఎందుకంటే ఏపీలో కక్షసాధింపు చర్యలకు తావు ఉండొద్దని సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అనుకున్నారు. జగన్ హయాంలో కక్ష సాధింపు చర్యలే ఎక్కువగా ఉన్నాయి. అవి ఆ పార్టీని పాతాళానికి పడేశాయి. అందుకే చంద్రబాబు అలాంటి వాటికి దూరంగా ఉండాలి అనుకుంటే.. అదే వీరిద్దరూ అదునుగా చేసుకున్నారు. వైసీపీ నేతలు కూటమి మంచి తనాన్ని చేతకాని తనం అనుకుని మరింత దారుణంగా రెచ్చిపోయి అరాచకాలకు పాల్పడ్డారు.
పెడనలో జోగి రమేశ్ ప్రభుత్వ భూములు అమ్ముకున్నారనే ఆరోపణలు చాలానే ఉన్నాయి. వల్లభనేని వంశీ గన్నవరంలోని కొండలన్నీ కొట్టేశారు. వైసీపీ హయాంలో టీడీపీ నేతలు, జనసేన నేతలపై దారుణంగా దాడులు చేసిన చరిత్ర వంశీకి ఉంది. అలాగే గన్నవరం టీడీపీ ఆఫీసు మీద తన గూండాలతో వెళ్లి దాడులు చేశారు. అక్కడున్న ఆపరేటర్ ను కిడ్నాప్ చేసి.. చివరకు అతను కేసును వాపసు తీసుకునే విధంగా దారుణాలకు బరితెగించారు. ఇలాంటివి చేసిన తర్వాత ఇంక ఊరుకోవడం మంచిది కాదని కూటమి సీరియస్ యాక్షన్ తీసుకుంది. అతనిపై కేసులు పెట్టాలని ఆదేశించింది. ఇక జోగి రమేశ్ చేసిన అరాచకాల బాధితులు కూడా ఎక్కువ ఉండటంతో కూటమి సీరియస్ అయింది.
దొంగ డాక్యమెంట్లతో చాలా మంది ప్రజల ఆస్తులను కొట్టేశాడు జోగి రమేశ్. అలాగే కల్తీ లిక్కర్ తో ఎంతటి అరాచకాలకు పాల్పడ్డాడో మనం చూశాం. వందలాది మంది ప్రాణాలను ఈ కల్తీ లిక్కర్ తీసింది. ఇక అగ్రిగోల్డ్ భూముల ఆక్రమణ కూడా జోగి రమేశ్ మీదున్న అతిపెద్ద కేసు. ఇంతటి దారుణాలకు పాల్పడ్డ జోగి రమేశ్.. చివరకు కూటమి ప్రభుత్వమే కల్తీ లిక్కర్ అమ్ముతోందని అర్థం లేని ఆరోపణలు చేశారు. అందుకే ఇప్పుడు కటకటాలు లెక్కపెడుతున్నారు. వైసీపీ హయాంలో బాధితులకు కూటమి న్యాయం చేస్తుందనే భావనలో అంతా ఉన్నారు. వేల ఎకరాలను కబ్జా చేసిన వైసీపీ నేతలు.. సదరు బాధితులు ఇప్పుడు కూటమి వైపు చూస్తుంటే ఓర్చుకోలేకపోతున్నారు. కూటమికి ఎలాంటి కక్ష సాధింపు చర్యలు లేవు. తప్పుడు చేసిన వారిపై కఠిన శిక్షలు తీసుకుంటే కక్ష సాధింపు అనడం కరెక్ట్ కాదు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com

