CBN: టీడీపీ-జనసేన ప్రభంజనం ఖాయం

CBN: టీడీపీ-జనసేన ప్రభంజనం ఖాయం
వైసీపీ రౌడీ ఇజం సాగనీయబోమన్న చంద్రబాబు.... మండపేట రా కదలి రా సభలో పోటెత్తిన ప్రజలు

తెలుగుదేశం- జనసేన కూటమి తూర్పు గోదావరి జిల్లాలో అన్ని స్థానాలు గెలుచుకుంటుందని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. అక్రమాలకు పాల్పడుతూ ప్రజల సొమ్మును దోచుకున్న వారి నుంచి ప్రతీ ఒక్క రూపాయి కక్కించే బాధ్యత తాము తీసుకుంటామని చంద్రబాబు స్పష్టం చేశారు. కోనసీమ జిల్లా మండపేటలో నిర్వహిచిన "రా కదలిరా ”.సభకు జనం పెద్దఎత్తున తరలి రాగా ఆయన శ్రేణులను ఉద్దేశించి ప్రసంగించారు. కోనసీమలో వైసీపీ రౌడీయిజం జరగనివ్వనని చంద్రబాబు అన్నారు. ఐదు సంవత్సరాలు విధ్వంసపాలన సాగుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీ రోజు ముగ్గురు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆక్వా రంగాన్ని ఆదుకుంటామని చంద్రబాబు హమీ ఇచ్చారు.


100 సంక్షేమ కార్యక్రమాలకు కోత పెట్టిన ఘనత సీఎం జగన్ దేనని చంద్రబాబు అన్నారు. ఇసుక దోపిడీకి పాల్పడిన వారి నుంచి దోచుకున్న సొత్తును కక్కించే బాధ్యత తాను తీసుకుంటానని హామీ ఇచ్చారు. సంపద సృష్టించకుండా విధ్వంసాలు చేస్తున్నారని చంద్రబాబు మండిపడ్డారు. అంబేడ్కర్ విగ్రహం ఆవిష్కరించే హక్కు సీఎం జగన్ కు లేదని తెలుగుదేశం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ఒక దళిత ద్రోహి అని..... అనేక మంది దళితులు వైసీపీ ప్రభుత్వంలో ప్రాణాలు కోల్పాయారని చంద్రబాబు గుర్తు చేశారు. తాము అధికారంలోకి వస్తే దళితులకు వైసీపీ తొలగించిన పథకాలు పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. వైసీపీ ప్రభుత్వం గిరిజన వ్యతిరేక విధానాలు అవలంబిస్తోందని విమర్శించారు. నమ్మించి గిరిజనుల గొంతుకోసిన వ్యక్తి జగన్ అని ధ్వజమెత్తారు. సామాజిక న్యాయం చేస్తున్నానని సీఎం గొప్పలు చెప్పుకుంటున్నారని ఎద్దేవా చేశారు.


జీవో నంబర్ 3 ఎందుకు రద్దుచేశారో చెప్పాలని సవాల్ విసిరారు.తెలుగుదేశం, జనసేన అధికారంలోకి రాగానే మళ్లీ జీవోను తెస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల పిల్లలు చదువుకోవడం జగన్ కు ఇష్టం లేదని ..వారి అభివృద్ధి కోసం పెట్టిన పథకాలను అటకెక్కించారని మండిపడ్డారు. ఎక్కాడ రోడ్లు లేవన్న చంద్రబాబు...అమాయకులు చనిపోతున్నా పట్టాదా అని నిలదీశారు. జనాలకు ఇచ్చేది తక్కువ దోచేది ఎక్కువని విమర్శించారు. తాము వచ్చిన వెంటనే అన్ని వర్గాలకు న్యాయం చేస్తానని భరోసా ఇచ్చారు..

టీడీపీ అరకు కాఫీని ప్రమోట్‌ చేస్తే.. జగన్‌ ప్రభుత్వం గంజాయిని చేస్తోందని చంద్రబాబు విమర్శించారు. జగన్‌ దోచేది ఎక్కువ.. జనాలకు ఇచ్చేది తక్కువని మండిపడ్డారు. గిరిజనుల పొట్టకొట్టే ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వమని.... నమ్మించి గొంతు కోసిన వ్యక్తి జగన్‌ అని చంద్రబాబు మండిపడ్డారు. గిరిజన ప్రాంతాల్లోని ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని సంకల్పించానని... తాను గతంలో ఇచ్చిన జీవో నెంబర్‌ 3ని ఎందుకు రద్దు చేశారో వైసీపీ నేతలు చెప్పాలని డిమాండ్‌ చేశారు. సామాజిక న్యాయం చేస్తానని సీఎం గొప్పలు చెబుతున్నారని.... జీవో నెంబర్‌ 3 రద్దు చేయడం సామాజిక న్యాయమా అని నిలదీశారు. మళ్లీ టీడీపీ అధికారంలోకి రాగానే దానిని పునరుద్ధరిస్తామని హామీ ఇచ్చారు. గిరిజనుల కోసం తాము 16 పథకాలు ప్రత్యేకంగా తీసుకొచ్చామని.... వాటిని ఎందుకు రద్దు చేశారో జగన్‌ చెప్పాలని సవాల్‌ విసిరారు.

Tags

Read MoreRead Less
Next Story