Krishna District: కృష్ణా జిల్లా ZPHSలో మాస్ కాపీ.. ఉపాధ్యాయుల సాయంతోనే..

X
Krishna District: కృష్ణా జిల్లా గుడ్లవల్లేరు మండలం డోకిపర్రు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాస్ కాపీయింగ్ కలకలం రేపింది. పక్కనే ఉన్న పసమర్రు ZPHS నుంచి డోకిపర్రు పాఠశాలకు ప్రశ్నాపత్రాలతో పాటు ఆన్సర్ స్లిప్పులు పంపుతున్నట్లు అధికారులకు ఫిర్యాదులు అందాయి. సమాచారం అందుకున్న విద్యా శాఖ, పోలీసు అధికారులు వెంటనే పసుమర్రు జిల్లా పరిషత్ పాఠశాలలో తనిఖీలు నిర్వహించారు.
తనిఖీల్లో డీఈవో తాహిరా సుల్తానా కూడా పాల్గొన్నారు. పలువురు ఉపాధ్యాయుల సెల్‌ఫోన్‌లలో ఇవాళ్టి పరీక్షకు సంబంధించిన సమాధానాలు గుర్తించారు. స్లిప్పులు పంపుతున్న ఐదుగురు ఉపాధ్యాయులను గుర్తించామన్నారు డీఈవో తాహిరా సుల్తానా. ఉపాధ్యాయుల ఫోన్లలో అయాం వెయిటింగ్, పేపర్ టైట్ అన్న సందేశాలు గుర్తించామన్నారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com
