Lok Sabha : లోక్ సభలో ఉట్టిపడిన తెలుగుదనం

18వ లోక్ సభ సభ్యులుగా తెలంగాణ, ఏపీ నుంచి పలువురు ఎంపీలు ప్రమాణస్వీకారం చేశారు. ఇందులో కొందరు పంచెకట్టులో సంప్రదాయబద్ధంగా సభకు హాజరై అందరి దృష్టినీ ఆకర్షించారు. ఈ సందర్భంగా వారిలో చాలా మంది తెలుగులోనే ప్రమాణం చేశారు. ఏపీకి చెందిన విజయనగరం టీడీపీ ఎంపీ కలిశెట్టి అప్పల్నాయుడు ఏకంగా సైకిల్ పై పార్లమెంట్ కు చేరుకుని పార్టీ పట్ల తనకున్న అభిమానాన్ని చాటుకున్నాడు.
తెలంగాణ నుంచి కేంద్రమంత్రులు కిషన్ రెడ్డి, బండి సంజయ్ ప్రమాణం చేశారు. కిషన్ రెడ్డి తెలుపు రంగు పంచె కట్టులో హాజరవగా, బండి సంజయ్ ఎప్పటిలాగే వైట్ కలర్ డ్రస్సులో వచ్చారు. వీరిద్దరూ తెలుగులోనే ప్రమాణం చేశారు. ఆంధ్రప్రదేశ్ నుంచి టీడీపీ ఎంపీలు కింజరాపు రామ్మోహన్ నాయుడు, పెమ్మసాని చంద్రశేఖర్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేశారు. రామ్మోహన్ నాయుడు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రిగా, చంద్రశేఖర్ కేంద్ర గ్రామీణా భివృద్ధి శాఖ సహాయ మంత్రి గా, బీజేపీ ఎంపీ భూపతి రాజు శ్రీనివాస వర్మ భారీ పరిశ్రమలు, ఉక్కు శాఖ సహాయ మంత్రిగా గతంలోనే బాధ్యతలు స్వీకరించారు.
దగ్గుబాటి పురందేశ్వరి, కలిశెట్టి అప్పులు నాయుడు, శ్రీ భరత్, వల్లభనేని బాల శౌరి, కేశినేని శివనాథ్ తెలుగులో ప్రమాణ స్వీకారం చేయగా, సీఎం రమేశ్, ఉదయ్ శ్రీనివాస్, హరీష్ బాలయోగి, పుట్టా మహేశ్ కుమార్ తదితరులు ఇంగ్లీష్ లో ప్రమాణ స్వీకారం చేశారు. వైకాపా ఎంపీలలో మిథన్ రెడ్డి ఇంగ్లీష్ లో ప్రమాణం చేయగా, డాక్టర్ గుమ్మ తనూజారాణి, డాక్టర్ గురు మూర్తి తెలుగులో ప్రమాణం చేశారు.
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com