Undavalli Petition: స్కిల్‌ కేసులో ఉండవల్లి పిటిషన్ విచారణ

Undavalli Petition: స్కిల్‌ కేసులో ఉండవల్లి పిటిషన్ విచారణ
తదుపరి విచారణను డిసెంబర్ 13కు వాయిదా

స్కిల్‌ డెవలప్‌మెంట్‌ కేసు విచారణ సిబిఐకు అప్పగించాలంటూ దాఖలైన పిటిషన్ విచారణ వాయిదా పడింది. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్‌ కుమార్ దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రతివాదులకు నోటీసులు జారీ చేశారు. అయితే ప్రతివాదులందరికి నోటీసులు అందలేదని పిటిషనర్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఇప్పటికే 39మంది ప్రతివాదులకు నోటీసులు జారీ చేసినట్లు హైకోర్టు రిజిస్ట్రార్‌ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. మరోవైపు సరైన చిరునామాలు లేకపోవడంతో కొందరు ప్రతివాదులకు కోర్టు నోటీసులు అందలేదని పిటిషనర్‌ వివరించారు. వ్యక్తిగతంగా పిటిషనర్లకు నోటీసులు అందించేందుకు అనుమతించాలని కోరారు. దీంతో పిటిషనర్‌ కొత్త చిరునామాలతో కోర్టు నోటీసులను ప్రతివాదులకు అందించేందుకు అనుమతించిన హైకోర్టు కేసు విచారణ డిసెంబర్ 13వ తేదీకి వాయిదా వేసింది.

స్కిల్ డెవలప్ మెంట్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు రెగ్యులర్ బెయిల్ పై బయట ఉన్న సంగతి తెలిసిందే. చంద్రబాబు ర్యాలీలు, రాజకీయ కార్యకలాపాల్లో పాల్గొనవచ్చని సుప్రీంకోర్టు కూడా నిన్న ఆయనకు స్వేచ్ఛను ప్రసాదించింది. మరోవైపు, ఈ కేసు విచారణను సీబీఐకి అప్పజెప్పాలని మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ హైకోర్టులో పిటిషన్ వేసిన సంగతి విదితమే.

ఈ పిటిషన్ ను ఈరోజు హైకోర్టు విచారించింది. ఈ కేసులో కొందరికి మాత్రమే నోటీసులు అందాయని... మరికొందరికి అందలేదని పిటిషనర్ తరపు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకొచ్చారు. 39 మంది ప్రతివాదులకు నోటీసులు ఇచ్చామని, మిగతా వారి అడ్రస్ లు తప్పుగా ఉండటంతో అవి వారికి చేరలేదని కోర్టుకు రిజిస్ట్రార్ తెలిపారు. వీరికి పర్సనల్ గా నోటీసులు ఇచ్చేందుకు సమయం కోరారు. ఈ నేపథ్యంలో తదుపరి విచారణను హైకోర్టు డిసెంబర్ 13కు వాయిదా వేసింది.

Tags

Read MoreRead Less
Next Story