Minister Gottipati : విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్‌దే: మంత్రి గొట్టిపాటి

Minister Gottipati : విద్యుత్ ఛార్జీల పెంపు పాపం జగన్‌దే: మంత్రి గొట్టిపాటి
X

రాష్ట్రంలో విద్యుత్ ఛార్జీల అంశాన్ని మండలి ప్రశ్నోత్తరాల్లో వైసీపీ సభ్యులు ప్రస్తావించారు. దీనికి మంత్రి గొట్టిపాటి రవికుమార్ సమాధానమిచ్చారు. కూటమి ప్రభుత్వం విద్యుత్ ఛార్జీలను పెంచలేదని, పెంచబోదని స్పష్టం చేశారు. ఛార్జీల పెంపు పాపం జగన్‌దేనని విమర్శించారు. ఐదేళ్లలో 9సార్లు పెంచి ప్రజలపై భారం మోపారని ఆరోపించారు. ఇప్పుడు ప్రజలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేస్తున్నారని దుయ్యబట్టారు.

పోలవరం ఎత్తును 41.15 మీటర్లకు కుదిస్తూ వైసీపీ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిందని మంత్రి నిమ్మల రామానాయుడు అసెంబ్లీలో ఆరోపించారు. జగన్ సర్కార్ ప్రాజెక్టును నిలిపేసిందని, డయాఫ్రంవాల్ కొట్టుకుపోయేలా చేసిందని విమర్శించారు. 2025 కల్లా పోలవరం ఎడమ కాలవ పనులు పూర్తిచేస్తామని ధీమా వ్యక్తం చేశారు. ప్రాజెక్టును 45.72 మీటర్ల ఎత్తుకు నిర్మించి రాయలసీమ, ఉత్తరాంధ్రకు నీటిని తరలిస్తామని హామీ ఇచ్చారు.

‘తల్లికి వందనం’ పథకంపై మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో కీలక ప్రకటన చేశారు. త్వరలోనే ఈ పథకం గైడ్‌లైన్స్ విడుదల చేస్తామని ప్రకటించారు. పథకంపై మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. మే నెలలో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని, బడ్జెట్‌లో రూ.9407 కోట్ల కేటాయించినట్లు తెలిపారు. కాగా ఈ పథకం కింద 1-12వ తరగతి వరకు చదివే విద్యార్థులకు ప్రభుత్వం రూ.15,000 జమ చేయనుంది.

Tags

Next Story