Nara Lokesh : పులివెందుల ప్రజలు అభివృద్దికి ఓటేశారు: నారా లోకేశ్

కడప జిల్లాలోని పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నికల ఫలితాలపై మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ స్పందించారు. ఈ ఎన్నికలు దాదాపు 30 ఏళ్ల తర్వాత పులివెందులలో తొలిసారిగా నిజమైన ప్రజాస్వామ్య వాతావరణంలో జరిగాయన్నారు. ప్రజలు ఎటువంటి భయం లేకుండా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు.
ఈ విజయం ఎంతో కష్టపడి సాధించిందని లోకేశ్ సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. పులివెందుల, ఒంటిమిట్ట ప్రజలు తిరోగమనాన్ని కాకుండా, పురోగతికి పట్టం కట్టారని అన్నారు. ఈ ఎన్నికల్లో టీడీపీ బలపరిచిన అభ్యర్థుల విజయం ఈ విషయాన్ని స్పష్టం చేస్తోందని తెలిపారు.
స్థానిక ఎన్నికల్లో విజయం సాధించిన మారెడ్డి లతారెడ్డి, ముద్దుకృష్ణారెడ్డిలకు నారా లోకేశ్ తన హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేశారు. టీడీపీ అభ్యర్థులకు మద్దతుగా నిలిచేందుకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి ఓట్లు వేసిన ప్రజలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. ప్రజల మద్దతుతోనే ఈ విజయం సాధ్యమైందని లోకేశ్ పేర్కొన్నారు. ఈ విజయం భవిష్యత్తులో టీడీపీ మరిన్ని విజయాలు సాధిస్తుందనడానికి నిదర్శనమని ఆయన అన్నారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com