MLA Daggupati Prasad : కూటమి పాలనలో రాష్ట్రం ప్రశాంతంగా ఉంది

గత ఐదేళ్లలో రౌడీల రాజ్యం, కబ్జాలతో పాలన సాగితే ఇప్పుడు రాష్ట్రం ప్రశాంతంగా ఉందని ప్రజలు చెబుతున్నారని అనంతపురం అర్బన్ ఎమ్మెల్యే దగ్గుపాటి ప్రసాద్ తెలిపారు. 22వ డివిజన్ బుడ్డప్ప నగర్ లో సుపరిపాలన తొలి అడుగు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఎమ్మెల్యే దగ్గుపాటి ఇంటింటికి వెళుతూ ఏడాది కాలంలో ప్రభుత్వం అందించిన సంక్షేమ కార్యక్రమాల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గతంలో రాష్ట్రం రావణ కాష్టంలా ఉండేదని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడే వారన్నారు. చాలా చోట్ల రౌడీల రాజ్యం, గుండాల రాజ్యం నడిచిందన్నారు. కానీ చంద్రబాబు పాలనలో రౌడీలో గుండాలకు తావు లేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రం ప్రశాంతంగా ఉందని అందుకే ఇప్పటికే 9.5 లక్షల కోట్ల పెట్టుబడులు, 8.50 లక్షల ఉద్యోగాలు వచ్చాయన్నారు. డంపింగ్ యార్డ్ లో చెత్త తరలించే ప్రక్రియ నిన్ననే మొదలైందన్నారు. మొత్తం లక్షా 70 వేల టన్నుల చెత్తను అక్టోబర్ రెండు నాటికి క్లియర్ చేస్తామన్నారు. అనంతపురం నగరాన్ని ప్రథమ స్థానంలో నిలపడమే తమ లక్ష్యం అని దగ్గుపాటి స్పష్టం చేశారు.
Tags
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com