AP: వాలంటీర్ ఇష్యూ..పొలిటికల్ వార్

AP: వాలంటీర్ ఇష్యూ..పొలిటికల్ వార్
రెడ్‌క్రాస్ వాలంటీర్లకు రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు అధిపతులని మరి ఏపీలోని వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరని పవన్ నిలదీశారు.

ఏపీలో వాలంటీర్ వ్యవస్థ పొలిటికల్ వార్ కు కేంద్ర బిందువుగా మారింది. అటు వారాహి యాత్రలో వాలంటీర్ వ్యవస్థపై పవన్ ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇటు విపక్ష నేతలు కూడా ఈ సిస్టమ్‌ పై సీరియస్‌గానే స్పందిస్తున్నారు.హిట్లర్ నిఘా వ్యవస్థ లాగా జగన్ వాలంటీర్ వ్యవస్థ ఉందని జనసేనానికల్యాణ్ మండిపడ్డారు.ఇన్ని వ్యవస్థలు ఉన్నా కూడా సమాంతరంగా ఇంకో వ్యవస్థను నడపడం కేవలం ప్రజలను కంట్రోల్ చేయడానికేనన్నారు.వాలంటీర్లు సేకరించే సమాచారంతో రాష్ట్రంలో ఏ మూలన వైసీపీ వ్యతిరేకులు ఉన్నారో జగన్ గమనిస్తున్నాడు. జర్మనీలో హిట్లర్ ఇలానే చేసేవాడని గుర్తు చేశారు.

ఏపీకు చెందిన 6 కోట్ల మంది ప్రజల సమాచారం హైదరాబాద్ లోని ఎఫ్ఓఏ అనే ఏజెన్సీ దగ్గర ఉందని పవన్‌ తెలిపారు. అక్కడ పనిచేస్తున్న 700 మంది సిబ్బంది ప్రజల డేటాతో ఏం చేస్తున్నారని..వారికి జీతాలు ఎవరు చెల్లిస్తున్నారు అని పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. రెడ్‌క్రాస్ వాలంటీర్లకు రాష్ట్రపతి, రాష్ట్రాల గవర్నర్లు అధిపతులని మరి ఏపీలోని వాలంటీర్ వ్యవస్థకు అధిపతి ఎవరని పవన్ నిలదీశారు. వాలంటీర్లు ఏదో చేసేస్తారు.. పథకాలు ఆగిపోతాయని అనుకోవద్దని,ధైర్యంగా ముందుకొచ్చి పోలీసులు,కలెక్టర్‌కు ఫిర్యాదు చేయాలన్నారు.అసలు వ్యక్తిగత సమాచారం తీసుకునే లీగల్ అథారిటీ వాలంటీర్లకు ఎవరిచ్చారని,వాలంటీర్ల వ్యవస్థలోకి కొన్ని దుష్ట శక్తులు ప్రవేశించాయని పవన్ ఆరోపించారు.

మరోవైపు వాలంటీర్ల తీరుతో పెను ప్రమాదం పొంచి ఉందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. వాలంటీర్లు వ్యక్తిగత సమాచారం సేకరించడం ద్రోహమన్నారు. వలంటీర్లు పౌరసేవకు పరిమితం కాకుండా రాజకీయ జోక్యం చేసుకుంటే కుదరదన్నారు. వ్యక్తిగత సమాచార సేకరణ వల్ల చాలా ప్రమాదం పొంచి ఉందన్నారు. టీడీపీ అధికారంలోకి వస్తే ప్రజా సేవ వరకే వలంటీర్ల సేవలను పరిశీలిస్తామన్నారు.వాలంటీర్ల రోజు జీతం బూమ్, బూమ్ బీర్ కంటే తక్కువంటూ సెటైర్లు వేశారు.భార్యభర్తల మధ్య గోడవలతో వాలంటీర్లకు సంబంధం ఏంటని చంద్రబాబు ప్రశ్నించారు. పార్టీ పనులు వాలంటీర్లు చేయాల్సిన పనేంటని చంద్రబాబు అన్నారు. ఇటు పవన్ అటు చంద్రబాబు వ్యాఖ్యలతో వాలంటీర్ వ్యవస్థ చుట్టూ ఏపీ రాజకీయాలు తిరుగుతున్నాయి

అటు వాలంటీర్ వ్యవస్థను పంచాయతీలను నిర్వీర్యం చేయడానికి తీసుకొచ్చారని అన్నారు సీపీఎం కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు.వాలంటీర్ల వ్యవస్థ వైసీపీ ఆధీనంలో ఉందని,వాలంటీర్ వ్యవస్థను అధికార వికేంద్రీకరణ కోసం తీసుకుని రాలేదని ఆరోపణలపై విచారణ చేయాలని అన్నారు.

మరోవైపు వాలంటీర్ల వ్యవస్థపై ఉన్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వ ఉద్యోగులపై నమ్మకం లేక వాలంటీర్లను పెట్టారా అని హైకోర్టు ప్రశ్నించింది. లబ్ధదారుల ఎంపిక బాధ్యతను వాలంటీర్లకు ఎలా అప్పగిస్తారు? అని నిలదీసింది. గతంలో లబ్ధిదారులను గుర్తించింది ప్రభుత్వ ఉద్యోగులే కదా అని ప్రశ్నించింది. రాజకీయ కారణాలతో తమను జాబితా నుంచి తొలగించారని గారపాడుకు చెందిన 26 మంది లబ్ధిదారులు హైకోర్టును ఆశ్రయించిన నేపధ్యంలో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది.

ఇక ప్రభుత్వం అప్పగించిన బాధ్యతలు నిర్వహిస్తున్నామనే ముసుగులో మహిళలతో అసభ్యంగా ప్రవర్తిస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. కొందరు అత్యాచారాలకు తెగబడుతున్నారని,మద్యం అక్రమ రవాణా, నాటుసారా తయారీ, భౌతిక దాడులు, భూకబ్జాలు, గంజాయి స్మగ్లింగ్, ప్రజల నుంచి సొమ్ములు వసూలు చేసి పరారవటం ఇలా అనేక నేరాలకు పాల్పడుతున్న ఘటనలు ఏపీలో వెలుగులోకి వస్తున్నాయి.

Tags

Read MoreRead Less
Next Story