AP Jobs: 'ఏపీలో ఉద్యోగాల భర్తీ ఉత్తుత్తి ప్రకటనేనా?'.. ప్రశ్నిస్తున్న యువత..

AP Jobs: ఏపీలో ఉద్యోగాల భర్తీ ఉత్తుత్తి ప్రకటనేనా?.. ప్రశ్నిస్తున్న యువత..
AP Jobs: అధికారంలోకి రాగానే సర్కార్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన జగన్‌.. సీఎం అయ్యాక జాబ్‌ క్యాలెండర్‌ ప్రకటించారు

AP Jobs: అధికారంలోకి రాగానే సర్కార్‌ ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పిన జగన్‌.. సీఎం అయ్యాక జాబ్‌ క్యాలెండర్‌ కూడా ప్రకటించారు. దీంతో నిరుద్యోగ యువత హర్షం వ్యక్తం చేసింది. APPSC, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు, డీఎస్పీ తదితరాల భారీగా నోటిఫికేషన్లు వస్తాయని అంతా భావించారు. అయితే మూడు సంవత్సరాలు దాటినా సర్కారు కొలువులు లేకపోవడంతో యువకులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. పలు సందర్భాల్లో, సమీక్షల్లో సీఎం చెప్పిన ప్రకారమైతే.. గతేడాది జులై నుంచి ఈ ఏడాది మార్చి వరకు వరుస నోటిఫికేషన్లు వెలువడి ఉండాలి.

2021 జూన్‌లో మొత్తం 10 వేల 143 పోస్టుల భర్తీకి ఆమోదం తెలుపుతూ ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇందులో వివిధ శాఖల్లోని బ్యాక్‌లాగ్‌ వేకెన్సీలు వేయి 238, వైద్య ఆరోగ్య శాఖకు చెందిన 6వేల 143 పోస్టుల భర్తీ చేసింది. లక్షల మంది నిరుద్యోగులు ఎదురుచూస్తున్న గ్రూపు-1, 2, పోలీసు, అధ్యాపక, ఆచార్యుల పోస్టుల భర్తీపై అసలు ఊసెత్తడం లేదు. ఇక వైసీపీ జాబ్‌ క్యాలెండర్‌ పై.. కేంద్ర మంత్రి అనురాగ్‌ ఠాకూర్‌ కూడా తీవ్రంగా విమర్శించారు. జాబ్‌ క్యాలెండర్‌ పేరుతో వైసీపీ ప్రభుత్వం యువతను మోసం చేశారని ఆరోపించారు.

ఈ రాష్ట్ర ప్రభుత్వం లిక్కర్‌, గంజాయి, ఇసుక, భూకబ్జాల మాఫియా అని ఉందని.. యువత ఉద్యోగాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. 2021 జూన్‌లో ఇచ్చిన గ్రూపు-1, 2 నోటిఫికేషన్‌లో కేవలం 36 పోస్టులు భర్తీ చేస్తున్నట్లు ప్రకటించడంతో యువత నుంచి ఆందోళన వ్యక్తం చేసింది. ఇక మళ్లీ 2022 మార్చి 31న ఇచ్చిన నోటిఫికేషన్‌లో గ్రూపు-1లో పోస్టులను 31 నుంచి 110కి... గ్రూపు-2లో 25 నుంచి 182కు పెంచారు. వీటి భర్తీ ప్రక్రియ ముందుకు సాగడం లేదు. జాబ్‌ క్యాలెండర్‌ ప్రకారం 450 పోలీసు కానిస్టేబుల్‌, ఎస్సై, ఇతర కేటగిరీల్లోని పోస్టులు నింపుతామని చెప్పినా, నోటిఫికేషన్‌ రాలేదు.

దీంతో యువత తీవ్ర అసహనానికి గురవుతోంది. ఇక రాష్ట్ర పోలీసు శాఖలో 14వేల 613 ఖాళీలు ఉండగా, కానిస్టేబుల్‌ ఉద్యోగాలే 12వేల 182 వరకు ఉన్నట్లు బీపీఆర్‌డీ తెలిపింది. వీటితో పాటు మిగిలిన శాఖల్లో కూడా భారీగా ఉద్యోగాలు ఖాళీగా మిగిలి ఉన్నాయి. ఉద్యోగాలు వస్తాయని నమ్మి ఓటేస్తే తమను నిండా ముంచారని యువత ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఇటు అర్హత వయసు దాటిపోయి.. నిరుద్యోగులు అనర్హులుగా మిగిలిపోతామని ఆందోళన చెందుతున్నారు.

Tags

Read MoreRead Less
Next Story