Chittoor : అదుపుతప్పి ఆటోను ఢీకొట్టిన ట్రావెల్స్ బస్సు.. ఐదుగురు మృతి
X
By - Manikanta |22 Oct 2024 3:00 PM IST
చిత్తూరు జిల్లా, కలకడ మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా దూసుకెళ్లిన ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపుతప్పి ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో అక్కడికక్కడే ఐదుగురు మృతి చెందగా.. పలువురికి తీవ్ర గాయాలయ్యాయి. ప్రమాదానికి గురైన బస్సు సోమవారం రాత్రి చిత్తూరు నుంచి హైదరాబాద్ వస్తుండగా ఈ ఘటన జరిగింది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు అతివేగం.. ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు.
Next Story
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com