IAS : ఏపి లో ఐఏఎస్ అధికారుల బదిలీ

ఏపీలో (Andhra Pradesh) ఎన్నికలు సమీపిస్తున్న సంగతి తెలిసిందే. మరో మూడు నెలల్లో ఎన్నికలు జరగనున్నాయి. మరో 20 రోజుల్లో ఎన్నికల క్యాలెండర్ తేలనుంది. ఈ తరుణంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 21 మంది ఐఏఎస్‌లను (IAS) బదిలీ చేసింది. ఈ మేరకు సీఎస్ డాక్టర్ కేఎస్ జవహర్ రెడ్డి (KS Jawahar Reddy) ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ఉత్తర్వులు తక్షణమే అమల్లోకి వస్తాయని పేర్కొన్నారు. శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ శ్రీకేష్ బాలాజీ లట్కర్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ కమిషనర్‌గా బదిలీ అయ్యారు. మరోవైపు నంద్యాల కలెక్టర్ మంజీర్ జిలానీని శ్రీకాకుళం జిల్లా కలెక్టర్‌గా బదిలీ చేశారు. ఇక వైసిపి ప్రభుత్వం లక్ష్మీశను తిరుపతి కలెక్టర్‌గా నియమించింది.
బదిలీ అయిన అధికారుల వివరాలు!
ప్రస్తుతం తిరుపతి కలెక్టర్‌గా పనిచేస్తున్న వెంకట రమణారెడ్డిని హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్‌గా బదిలీ చేశారు. ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ శ్రీనివాసులును నంద్యాల కలెక్టర్‌గా నియమించారు. మరోవైపు అన్నమయ జిల్లా కలెక్టర్‌గా అభిషిక్ కిషోర్, శ్రీకాకుళం కమిషనర్‌గా తమీమ్ అన్సారియా, పార్వతీపురం జాయింట్ కలెక్టర్‌గా డాక్టర్ బీఆర్ అంబేద్కర్, డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్‌గా రోణంకి కూర్మనాథ్, విశాఖ కార్పొరేషన్ అదనపు కమిషనర్‌గా కేఎస్ విశ్వనాథం, విశాఖ అదనపు కమిషనర్‌గా మాయలను ప్రభుత్వం నియమించింది.
అలాగే, ప్రకాశం జాయింట్ కలెక్టర్‌గా గోపాలకృష్ణ రోణంకి, కాకినాడ జాయింట్ కలెక్టర్‌గా ప్రవీణ్ ఆదిత్య, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్‌గా అలేఖ్యలను ప్రభుత్వం నియమించింది. వైసిపి (YCP) ప్రభుత్వం సెటిల్‌మెంట్ ల్యాండ్ రికార్డ్స్ అదనపు డైరెక్టర్‌గా గోవిందరావును, విజయనగరం జాయింట్ కలెక్టర్‌గా కార్తీక్‌ను, అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్‌గా భావనను నియమించింది. APUFIDC హరితను CEO గా బదిలీ చేసింది. నెల్లూరు జిల్లా ఎస్పీఎస్ జాయింట్ కలెక్టర్‌గా ఆదర్శ్ రాజేంద్రన్, తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్‌గా అదితి సింగ్, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ విభాగం కార్యదర్శిగా రేఖారాణిలను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
బదిలీ అయినా అధికారుల లిస్ట్ ఇదే..
నంద్యాల కలెక్టర్ - శ్రీనివాసులు
అల్లూరి సీతారామరాజు-భావన జిల్లా కలెక్టర్
అన్నమయ జిల్లా కలెక్టర్: అభిషిక్త్ కిషోర్
విజయనగరం-కార్తీక్ జాయింట్ కలెక్టర్
పార్వతీపురం జాయింట్ కలెక్టర్: డాక్టర్ బిఆర్ అంబేద్కర్
విశాఖ-మయూర్ అశోక్ జాయింట్ కలెక్టర్
ప్రకాశం జిల్లా జాయింట్ కలెక్టర్ -గోపాలకృష్ణ రోణంకి
కాకినాడ జాయింట్ కలెక్టర్: ప్రవీణ్ ఆదిత్య
SPS నెల్లూరు-ఆదర్శ్ రాజేంద్రన్ జిల్లా జాయింట్ కలెక్టర్
పోలవరం-అలేఖ్య ప్రాజెక్ట్ మేనేజర్
అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్-గోవిందరావు
APUFIDC-హరిత డైరెక్టర్ జనరల్
తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్: అదితి సింగ్
సెక్రటరీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ శాఖ-రేఖారాణి
MD-వెంకట రమణారెడ్డి హౌసింగ్ కార్పొరేషన్
శ్రీకాకుళం కమిషనర్: తమీమ్ అన్సారియా
డిజాస్టర్ మేనేజ్‌మెంట్ డైరెక్టర్ - రోణంకి కూర్మనాథ్
విశాఖ కార్పొరేషన్ అదనపు కమిషనర్-కెఎస్ విశ్వనాథం
© Copyright 2025 : tv5news.in. All Rights Reserved. Powered by hocalwire.com